సర్కారు వారి పాట ఆమెకే వెళ్ళింది!

Sarkaru Vaari Paata Heroine

మహేష్ బాబుతో పరశురామ్ రూపొందించే చిత్రానికి సర్కారు వారి పాట అనే టైటిల్ పెట్టడం, మహేష్ చెవికి పోగు, మెడ మీద రూపాయి టాటూ గెటప్ వేయడం అభిమానులని ఉర్రూతలూగిస్తోంది. ప్రకటనతోనే ఈ చిత్రానికి భలే క్రేజ్ వచ్చేసింది. ఈ చిత్రం కోసం ప్రకటించిన సాంకేతిక బృందం కూడా సూపర్ గా ఉంది.

ఇక ఇందులో హీరోయిన్ ఎవరనే దాని గురించే చర్చ జరుగుతోంది. భరత్ అనే నేను చిత్రంలో మహేష్ కి జోడీగా నటించిన కియారా అద్వాని అయితే బాగుంటుందని పరశురామ్ ఆమె డేట్స్ కోసం ట్రై చేస్తున్నాడు. బాలీవుడ్ లో బిజీగా ఉన్న కియారా తెలుగులో నటించడానికి సిద్ధంగానే ఉంది కానీ కచ్చితమైన డేట్స్ ఇవ్వలెనని చెప్పిందట.

అసలు షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో, రోజుకి ఎన్ని గంటల షూటింగ్ వీలవుతుందో ఇంకా ఏదీ తెలియని ఈ సమయంలో డేట్స్ పక్కాగా చెప్పడం కాస్త కష్టమే. కియారా అయితే దాదాపు ఖరారయినట్టే సమాచారం.