కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినిమా పాట అంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యమే. కానీ కరోనా ఆయన్ని సడెన్‌గా తీసుకుపోయింది. ఎన్నో యేళ్లుగా అలరించిన ఆ మధుర స్వరం మూగబోయింది. బాలు అందరినీ వదిలి వెళ్లిపోయి అప్పుడే ఏడాది దాటేసింది. కానీ ఇప్పుడు మరోసారి ఆయన పాట అందరి వీనులకూ విందు చేయబోతోంది. రజినీకాంత్ సినిమా ద్వారా.
శౌర్యం, వీరమ్, వేదాళం, విశ్వాసం లాంటి సినిమాలు తీసిన శివ డైరెక్షన్‌లో ‘అన్నాత్తే’ మూవీ చేస్తున్నారు రజినీకాంత్. ఆయన సినిమా అంటే ఎంట్రీ సాంగ్ కామన్. ప్రతి సినిమాలోనూ రజినీ కోసం అదిరిపోయే ఎంట్రీ సాంగ్‌ని పనిగట్టుకుని పెడతారు డైరెక్టర్స్. వాటిని చాలా యేళ్లుగా బాలుయే పాడుతూ వచ్చారు. ‘అన్నాత్తే’ కోసం కూడా ఆయనే పాడారు. అయితే ఆ పాట బైటికి రాకముందే బాలు కన్నుమూశారు.
ఇప్పుడు ఆ పాటను రిలీజ్ చేయబోతున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 4న సాయంత్రం ఆరింటికి సాంగ్‌ను విడుదల చేయనున్నట్టు సన్ పిక్చర్స్ సంస్థ ప్రకటించింది. డి.ఇమ్మాన్ కంపోజ్ చేసిన ఈ పాట గత చిత్రాల్లోని రజినీ ఎంట్రీ సాంగ్స్‌ను మించి ఉంటుందంటున్నారు.
ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. నయనతార, కీర్తి సురేష్, ఖుష్బూ, మీనా లాంటి పాపులర్ స్టార్స్ చాలామంది ఇందులో నటించారు. రజినీ ఊరిపెద్దగా.. కీర్తి సురేష్ ఆయనకి కూతురిగా.. ఖుష్బూ, మీనా రజినీకి చెల్లెళ్లుగా కనిపిస్తారట. అన్నాచెల్లెళ్ల రిలేషన్ బేస్డ్‌గా సినిమా ఉంటుందని, అందుకే ‘అన్నాత్తే’ అని టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం. తెలుగులో ఏ పేరుతో రిలీజ్ చేస్తారనేది తెలియాల్సి ఉంది.
This post was last modified on October 2, 2021 12:10 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…