పోయినేడాది ఎక్కువగా వార్తల్లో నిలిచిన ఫిలిం సెలబ్రెటీస్‌లో రియా చక్రవర్తి పేరు ముందు వరుసలో ఉంటుంది. కొన్నేళ్ల కిందట సుమంత్ అశ్విన్‌కు జోడీగా ‘తూనీగ తూనీగ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన మాయమైన ఈ ముంబయి భామ.. బాలీవుడ్లోనూ అంత పేరున్న హీరోయినేమీ కాదు. కానీ గత ఏడాది అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రేయసి కావడంతో ఆమె వార్తల్లో వ్యక్తిగా మారింది.
సుశాంత్ మృతికి రియా పరోక్షంగా కారణమని, అతడికి డ్రగ్స్ అలవాటు చేసిందని, తన డబ్బులు కాజేసిందని.. ఇలా రకరకాల ఆరోపణలే వచ్చాయి తనమీద గత ఏడాది. సుశాంత్ ఆత్మహత్య అనంతరం ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని డ్రగ్స్ సహా వివిధ అంశాలపై ప్రశ్నించడం సంచలనం రేపింది. చివరికి ఈ కేసులో బెయిల్ మీద బయటికి వచ్చి కొన్ని రోజులకు సాధారణ జీవితం గడపడం మొదలుపెట్టింది.
సినీ రంగంలో అయితే రియాకు అంతగా అవకాశాలైతే కనిపించడం లేదు. ఆమె కెరీర్ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు తయారైంది. ఈ పరిస్థితుల్లో రియా చూపు బిగ్ బాస్ రియాలిటీ షో మీద పడ్డట్లుగా వార్తలొస్తున్నాయి. ఇలాంటి కాంట్రవర్శల్ పర్సనాలిటీలే ‘బిగ్ బాస్’ నిర్వాహకులు కూడా హౌస్‌లోకి రావాలని కోరుకుంటారు. రియా బిగ్ బాస్‌లోకి రాబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే బిగ్ బాస్‌కు ఎంపికైన ఒక పార్టిసిపెంట్‌తో కలిసి రియా ఒక స్టూడియోలో ఉన్న ఫొటో ఒకటి మీడియాలోకి రాగా.. ఈ షోలో పాల్గొనేందుకు వారానికి రూ.35 లక్షల చొప్పున పారితోషకం ఇచ్చేలా ఆమెతో నిర్వాహకులు ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. సినిమా కెరీర్ ఏమంత ఊపులో లేని నేపథ్యంలో రియా తనకున్న డిమాండ్‌ను ఇలా వాడుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. మరి నిజంగానే ఆమె హౌస్‌లోకి అడుగు పెడుతుందో లేదో చూడాలి.
This post was last modified on October 1, 2021 10:32 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…