Movie News

‘లవ్ స్టోరి’కి రెండు క్లైమాక్స్‌లు.. నిజమా?

దర్శకుడు శేఖర్ కమ్ముల తన కొత్త చిత్రం ‘లవ్ స్టోరి’ కోసమని రెండు క్లైమాక్స్‌లు చిత్రీకరించినట్లుగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కుల వివక్ష, లింగ వివక్ష చుట్టూ తిరిగే సినిమా అన్న సంగతి తెలిసిందే. కులాంతర ప్రేమ, పెళ్ళిళ్ళ విషయంలో సొసైటీలో జరిగిన కొన్ని దారుణ ఘటనల స్ఫూర్తితో కమ్ముల ఈ సినిమా తీసినట్లుగా సంకేతాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఇలాంటి కథల విషయంలో తమిళ ఫిలిం మేకర్స్ తీరు వేరుగా ఉంటుంది. వాళ్లు హార్ట్ బ్రేకింగ్‌గా ఉండేలా క్లైమాక్స్‌లు తీర్చిదిద్దుతుంటారు. కమ్ముల స్టైల్ ప్రకారం చూస్తే ఈ సినిమా ముగింపు అలా ఉండే అవకాశం లేదు. కానీ ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేసి చూద్దామన్న ఉద్దేశంతో ఆయన ఒక పాజిటివ్ క్లైమాక్స్‌తో పాటు.. ట్రాజిక్ క్లైమాక్స్ కూడా తీశారనే ప్రచారం సాగింది. ఏ క్లైమాక్స్‌ను సినిమాలో ఉంచాలనే విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నారనే విషయం సస్పెన్స్ అంటూ ఊహాగానాలు సాగాయి.

మరి ఈ రెండు క్లైమాక్స్‌ల కథేంటని హీరో నాగచైతన్యను అడిగితే.. ఈ ప్రచారాన్ని కొట్టిపారేశాడు. సినిమా కోసం రెండు భిన్నమైన క్లైమాక్స్‌ల చిత్రీకరణ అంటూ ఏమీ చేయలేదని.. కాకపోతే ఒకసారి క్లైమాక్స్ తీశాక దానికి కొంచెం మెరుగులు దిద్దే ప్రయత్నం జరిగిందని ‘లవ్ స్టోరి’ ప్రమోషన్ల కోసం మీడియాను కలిసిన సందర్భంగా చైతూ చెప్పాడు. ఇక తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చైతూ చెబుతూ.. ‘బంగార్రాజు’తో పాటు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అమేజాన్ కోసం ఒక హార్రర్ సిరీస్ చేస్తున్నట్లు వెల్లడించాడు.

ఐతే హార్రర్ సిరీస్ అయినప్పటికీ ఇందులో దయ్యం లాంటిదేమీ ఉండదని.. సూపర్ నేచురల్ పవర్ లాంటిది ఉంటుందని.. దాని చుట్టూ కథ తిరుగుతుందని చైతూ తెలిపాడు. విక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న ‘థ్యాంక్ యు’ షూటింగ్ ఇంకో పది రోజులు మిగిలుందని.. అది త్వరలోనే పూర్తి చేస్తామని.. కొత్త ప్రాజెక్టుల కోసం కథలు వింటున్నానని చైతూ చెప్పాడు.

This post was last modified on September 23, 2021 4:26 pm

Share

Recent Posts

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

1 hour ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

1 hour ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

2 hours ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… ఈసారి ఇంకా గట్టిగా!!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ).. తాజాగా మ‌రో ఉద్య‌మానికి తెర‌దీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…

2 hours ago

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

3 hours ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

5 hours ago