ఆస్పత్రిలో చేరిన యంగ్ హీరో..!

టాలీవుడ్ యువ కథానాయకుడు అడవి శేష్ అనారోగ్యం బారిన పడ్డారు. అడవి శేష్ కి ఇటీవల డెంగ్యూ సోకింది. రక్తంలో ప్లేటేట్లు కూడా పడిపోవడంతో.. ఆయన నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం చేరడం గమనార్హం.

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. వైద్యుల పర్యవేక్షిస్తున్నారని ఆయన టీమ్ ప్రకటించింది. ఈనెల 18వ తేదీన ఆస్పత్రిలో చేరారని.. కోలుకుంటున్నారని సమాచారం.

ఇదిలా ఉండగా.. అడవి శేష్ విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే ఉన్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఆయన ఆ తర్వాత హీరోగా మారారు. ముఖ్యంగా గూఢచారి.. ఎవరు వంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆయన విపరీతంగా ఆకట్టుకున్నారు.

విభిన్న కథాంశాలతో కూడిన సినిమాలతో ఆయన తక్కువ సినిమాలతోనే ప్రత్యేకత నిరూపించుకున్న అడవి శేష్ ఆస్పత్రి పాలైన విషయం తెలియడంతో అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు మెసేజ్లు చేస్తుండటం విశేషం.