Movie News

త‌మిళ బాహుబ‌లి పూర్త‌యింది

కొన్నేళ్ల ముందు వ‌ర‌కు బాలీవుడ్ త‌ర్వాత సినిమా క్వాలిటీ ప‌రంగా త‌మిళ సినిమాదే పైచేయిగా ఉండేది. అక్క‌డ వినూత్న‌మైన, ప్ర‌యోగాత్మ‌క‌ క‌థ‌లు తెర‌కెక్కేవి. అలాగే భారీ చిత్రాల జోరూ ఉండేది. త‌మిళంతో పోలిస్తే తెలుగు సినిమాలు వెనుక‌బ‌డే ఉండేవి. కానీ గ‌త ఐదారేళ్ల‌లో ప‌రిస్థితులు వేగంగా మారిపోయాయి. తెలుగు సినిమాల స్థాయి అమాంతం పెరిగిపోయింది. అదే స‌మ‌యంలో త‌మిళ చిత్రాలు వెనుక‌బ‌డిపోయాయి.

ముఖ్యంగా బాహుబ‌లి దెబ్బ‌కు కోలీవుడ్ కుదేలైపోయింద‌నే చెప్పాలి. ద‌క్షిణాదిన త‌మిళ చిత్రాల ఆధిప‌త్యానికి తెర‌దించింది ఆ చిత్ర‌మే. ఎప్పుడూ తెలుగులో త‌మిళ అనువాదాల జోరే చూసేవాళ్లం కానీ.. త‌మిళ బాక్సాఫీస్‌ను ఓ తెలుగు చిత్రం షేక్ చేయ‌డం బాహుబ‌లితోనే జ‌రిగింది. అది అక్క‌డి వాళ్ల‌కు అసూయ‌ను క‌లిగించింది. బాహుబ‌లికి దీటైన భారీ చిత్రం తీయాల‌ని అక్క‌డ గ‌ట్టి ప్ర‌య‌త్నాలే జ‌రుగుతూ వ‌చ్చాయి. కానీ ఇప్ప‌టిదాకా ఏ సినిమా కూడా దాని ద‌రిదాపుల్లోకి రాలేదు.

ఐతే లెజెండ‌రీ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ఎప్ప‌ట్నుంచో కంటున్న భారీ క‌ల‌.. పొన్నియ‌న్ సెల్వ‌న్ గ‌త ఏడాదే ప‌ట్టాలెక్క‌డంతో మ‌ళ్లీ త‌మిళుల్లో ఆశ‌లు రేకెత్తాయి. విక్ర‌మ్, ఐశ్వ‌ర్యారాయ్, కార్తి, త్రిష‌, జ‌యం ర‌వి, శ‌ర‌త్ కుమార్‌, ప్ర‌కాష్ రాజ్.. ఇలా భారీ తారాగ‌ణంతో.. వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెర‌కెక్కింది. త‌మిళంలో క‌ల్ట్ నావెల్‌గా పేరున్న పొన్నియ‌న్ సెల్వ‌న్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు మ‌ణిర‌త్నం. త‌మిళంలో ఇప్ప‌టిదాకా అత్య‌ధిక ఖ‌ర్చుతో తెర‌కెక్కిన సినిమా ఇది. బాహుబ‌లి త‌ర‌హాలోనే చారిత్ర‌క నేప‌థ్యంలో ఈ సినిమాను తెర‌కెక్కించారు.

మ‌ణిర‌త్నం ఇలాంటి నేప‌థ్యంలో సుదీర్ఘ స‌మ‌యం వెచ్చించి ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఈ సినిమా తీయ‌డంతో అంచ‌నాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. మొద‌లుపెట్టిన రెండేళ్ల త‌ర్వాత ఎట్ట‌కేల‌కు ఈ సినిమా పూర్త‌యింది. క‌రోనా క‌ష్టాల‌ను అధిగ‌మించి షూటింగ్ పూర్తి చేశాడు మ‌ణిర‌త్నం. ఇక పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కోసం ఆరు నెల‌ల‌కు పైగా వెచ్చించ‌నున్నారు. 2022 వేస‌విలో పొన్నియ‌న్ సినిమా వివిధ భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

This post was last modified on September 19, 2021 12:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏమిటో నితిన్ ధైర్యం?

అంతా అనుకున్న‌ట్లు జ‌రిగితే నితిన్ కొత్త చిత్రం రాబిన్ హుడ్ ఎప్పుడో రిలీజైపోయి ఉండాలి క్రిస్మ‌స్‌కు అనుకున్న ఆ చిత్రం…

1 hour ago

బిగ్ డే : తండేల్ మీదే అందరి కళ్ళు

నాగ చైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన తండేల్ థియేటర్లకు వచ్చేసింది. గత ఏడాది డిసెంబర్…

3 hours ago

‘పట్టు’ లేదని ముందే తెలుసుకున్నారా

ఈ మధ్య కాలంలో అజిత్ లాంటి స్టార్ ఉన్న పెద్ద సినిమా బజ్ లేకుండా విడుదలయ్యిందంటే అది పట్టుదల మాత్రమే.…

11 hours ago

‘అమ‌రావ‌తి’ని ఆప‌ద్దు: ఈసీ లేఖ‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ప‌రుగులు పెట్టించాల‌ని సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో…

14 hours ago

ప్ర‌జ‌ల్లోకి ప్ర‌భుత్వం.. సీఎం రేవంత్ ప్లాన్‌

'ప్ర‌జ‌ల్లోకి ప్ర‌భుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స‌రికొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌నున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన…

15 hours ago

బాస్ ఈజ్ బాస్ : విశ్వక్ సేన్

వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…

15 hours ago