‘లవ్ స్టోరి’ సినిమాలో కథ కులాంతర ప్రేమ చుట్టూ తిరుగుతుందన్న సంకేతాలు మొదట్నుంచి ఉన్నాయి. ఇటీవల రిలీజైన ట్రైలర్ చూసినా అది నిజమే అనిపిస్తోంది. జీవితంలో స్థిరపడటానికి కష్టపడుతున్న వేర్వేరు కులాలకు చెందిన అమ్మాయి, అబ్బాయి మధ్య పరిచయం ఏర్పడటం.. ఇద్దరూ ఒకరికొకరు అండగా నిలవడం.. తర్వాత ప్రేమలో పడటం.. ఇంతలో ఇరు కుటుంబాల పెద్దలకు విషయం తెలిసి వీరి పెళ్లికి అడ్డు చెప్పడం.. ఈ క్రమంలో సాగే పోరాటం నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని స్పష్టమవుతోంది.
ఐతే ఈ కథ రాయడానికి శేఖర్ కమ్ములకు మిర్యాలగూడ విషాదాంతం స్ఫూర్తిగా నిలిచిందని.. ఈ సినిమా కూడా విషాదాంతమే అని.. క్లైమాక్స్ హార్ట్ బ్రేకింగ్‌గా ఉంటుందని మీడియాలో ఒక ప్రచారం ముందు నుంచి నడుస్తోంది. కానీ చిత్ర వర్గాల సమాచారం ప్రకారం అలాంటిదేమీ ఉండదనే అంటున్నారు.
కులాంతర ప్రేమల విషయంలో సమాజం స్పందించే తీరు ఎలా ఉంటుందో జనరల్‌గా చూపించే ప్రయత్నం మాత్రమే ఈ సినిమాలో జరిగిందని.. పర్టికులర్‌గా ఒక ఉదంతాన్ని స్ఫూర్తిగా తీసుకోలేదని.. ఈ సినిమా విషాదాంతం ఎంతమాత్రం కాదని చిత్ర వర్గాలు అంటున్నాయి. తాజాగా ‘లవ్ స్టోరి’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన చిత్ర నిర్మాతలు కూడా ‘ఈ సినిమా గురించి మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. మిర్యాలగూడ ఉదంతంతో ఈ సినిమాకు సంబంధం లేదని.. ఇది శేఖర్ కమ్ముల స్టయిల్లో సాగే లైట్ హార్టెడ్ మూవీ అని స్పష్టత ఇచ్చారు.
విషాదాంతపు ప్రేమకథలు తమిళంలో బాగా ఆడతాయి కానీ.. తెలుగు ప్రేక్షకులకు ఇలాంటివి రుచించవు. మన దగ్గర అలాంటి ముగింపునిస్తే సినిమా రిజల్ట్ తేడా కొట్టొచ్చు. కాబట్టే నిర్మాతలు కూడా ఇలా క్లారిటీ ఇచ్చినట్లున్నారు. కాబట్టి కమ్ముల స్టయిల్లో ఆహ్లాదంగా.. కొంచెం ఎమోషనల్‌గా సాగే ప్రేమకథ అనే అంచనాలతో ‘లవ్ స్టోరి’ చూసేందుకు వెళ్లొచ్చు.
This post was last modified on September 18, 2021 6:42 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…