మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్ వినాయక చవితి పర్వదినాన రోడ్డు ప్రమాదంలో గాయపడటం టాలీవుడ్లో పెద్ద చర్చకే తావిస్తోంది. మీడియాలో ఈ ప్రమాదం గురించి వలువలు చిలువలుగా వార్తలు రావడం.. కొన్ని టీవీ ఛానెళ్లు దుష్ప్రచారాలు చేయడం మెగా ఫ్యామిలీకి ఆగ్రహం తెప్పిస్తోంది. ఒక ప్రమఖ ఛానెల్ అయితే నిన్నట్నుంచి ఇంతకంటే పెద్ద వార్త లేదన్నట్లుగా లైవ్ అప్డేట్లు, వరుస కథనాలు ఇస్తుండటం విస్మయం గొలుపుతోంది.
ఈ నేపథ్యంలో ఇలాంటి మీడియా మీద తేజుకు సన్నిహితుడైన ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తనదైన శైలిలో స్పందించాడు. అతడి పంచ్ ట్విట్టర్లో మామూలుగా పేలలేదు. హాట్స్ ఆఫ్ తమ్ముడు @IamSaiDharamTej. హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా ఎందరికో అన్నం పెడుతున్నావ్. నీ ఆక్సిడెంట్ వంకతో …. తప్పుడు వార్తలు అమ్ముకొని బతికేస్తున్న అందరు బాగుండాలి. వాళ్లకు ఆ అన్నం అరగాలి అని కోరుకుంటున్నాను Folded handsFolded handsFolded hands అంటూ తనదైన శైలిలో ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రం విసిరాడు హరీష్ శంకర్.
మరోవైపు దర్శకుడు, నిర్మాత సాయిరాజేష్ సైతం హరీష్ స్టయిల్లోనే మీడియాకు కౌంటర్లు వేశాడు. సోషల్ మీడియా, CCTV footage ఉన్న రోజుల్లో ఈ ఆక్సిడెంట్ జరిగింది.లేకపోయి ఉండుంటే ఏం జరిగేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రక్తం లో ఆల్కహాల్ ఎంత ఉంది అని ప్రభుత్వ కాంపౌండర్ దగ్గర ఒక బులెటిన్, స్పీడ్ 180 అని స్పోర్ట్స్ బైక్ నిపుణుడి దగ్గర ఒక విశ్లేషణ. జీవిత కాలం పట్టేది మచ్చ పోవటానికి అని ట్విట్టర్లో పేర్కొన్నాడు సాయిరాజేష్. తేజుకు, మెగా ఫ్యామిలీకి సన్నిహితులైన మరికొంతమంది సెలబ్రెటీలు సైతం ఓ వర్గం మీడియా చేస్తున్న అతిపై తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates