‘మా’ ఎలెక్షన్స్.. చిరు నిర్ణయమిదే!

ఎన్నడూ లేనంతగా ‘మా’ ఎలెక్షన్స్ లో అధ్యక్ష పదవి కోసం రగడ మొదలైంది. దానికి తోడు బండ్ల గణేష్ రాజకీయాలు ‘మా’లో మరిన్ని గొడవలకు దారి తీస్తుంది. ‘మా’లో విషయాలను బయటకు పొక్కనీయకుండా చూడమని చిరంజీవి లాంటి పెద్దలు ఎంతగా చెబుతున్నా ఎవరూ వినడం లేదు. చిన్న చిన్న విషయాలను కూడా రాజకీయం చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి చిరంజీవి మద్దతు ఇస్తున్నారనే విషయం అందరికీ ఇప్పుడు ఈ విషయంలో చిరు ఎక్కడా ఏం మాట్లాడడం లేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి.

ఇండస్ట్రీలో చిరుకి మంచి ఇమేజ్ ఉంది. దాసరి తరువాత స్థానంలో సినీ జనాలు చిరునే భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో చిరంజీవి ఏదో ఒక్క వర్గానికి మాత్రమే మద్దతు ఇవ్వడం సమంజసంగా ఉండదు. పైగా ప్రకాష్ రాజ్ కి ఓటు వేయమని ఆయన నేరుగా కూడా చెప్పలేరు. ఒకవేళ ప్రకాష్ రాజ్ గనుక ఓడిపోతే చిరు సపోర్ట్ ఇచ్చినా.. ఓడిపోయారనే మాటలు వినిపిస్తాయి. వీటన్నింటికీ దూరంగా ఉండడమే బెటర్ అని చిరు భావిస్తున్నారు.

అందుకే ‘మా’ ఎన్నికల్లో తటస్థంగా ఉండడమే సమంజసమని ఆయన నిర్ణయించుకున్నారు. అలా చూసుకుంటే చిరు ఫలానా వాళ్లకు ఓటేయండి.. సపోర్ట్ చేయండి అంటూ చెప్పే ఛాన్స్ లేనట్లే. తెరవెనుక కూడా ఆయన ఎలాంటి నడిపే అవకాశం ఉండదు. మరి చిరు మద్దతు లేకుండా ఏ వర్గం ఈ ఎన్నికల్లో గెలుస్తుందో చూడాలి!