ఒకప్పుడు తమిళ దర్శకుడు శంకర్ పేరెత్తితే ఆయన అందుకున్న ఘనవిజయాలు.. ఆయన పెట్టించే భారీ బడ్జెట్లు.. ఆయన చేసే ప్రయోగాల గురించే చర్చ ఉండేది. కానీ ఈ మధ్య మాత్రం వివాదాలే గుర్తుకొస్తున్నాయి. వరుసగా ఆయన ప్రతి సినిమా వివాదంలో చిక్కుకుంటుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇండియన్-2 సినిమా గొడవ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
రూ.180 కోట్లు ఖర్చు పెట్టి 60 శాతం చిత్రీకరణ పూర్తి చేశాక ఆ సినిమా వివాదాల్లో చిక్కుకుని ముందుకు కదలకుండా ఆగిపోయింది. దీని తర్వాత శంకర్ అనౌన్స్ చేసిన అపరిచితుడు రీమేక్‌కు ఒరిజినల్ ప్రొడ్యూసర్ ఆస్కార్ రవిచంద్రన్ అడ్డు పడ్డాడు. దీనిపై కేసు నడుస్తోంది. ఇప్పుడేమో రామ్ చరణ్‌తో శంకర్ తీయబోతున్న సినిమాకు కూడా ఇప్పుడో వివాదం అంటుకుంది.
చిన్నస్వామి అనే తమిళ రచయిత.. చరణ్‌తో శంకర్ తీయబోయే సినిమా కథ తనదంటూ ఆరోపణలు చేస్తున్నాడు. ఈ మేరకు అతను తమిళ రచయితల సంఘానికి ఫిర్యాదు చేశాడు. విజయ్‌తో శంకర్ తీయాల్సిన ఓ సినిమా కోసం తాను ఓ కథ తయారు చేశానని.. ఆ సినిమా అనివార్య కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదని.. ఇప్పుడు ఆ కథనే శంకర్, కార్తీక్ సుబ్బరాజ్ కాపీ కొట్టి రామ్ చరణ్‌తో సినిమా చేయడానికి రెడీ అయ్యారని అతను ఆరోపించాడు.
శంకర్‌తో కలిసి కార్తీక్ ఈ సినిమా స్క్రిప్టును తీర్చిదిద్దుతున్నట్లు వార్తలు రావడం తెలిసిందే. చిన్నస్వామి.. శంకర్‌తో పాటు కార్తీక్‌ల మీద ఆరోపణలు చేయడంతో మీడియా దృష్టి దీనిపైకి మళ్లింది. మరి ఈ వివాదంపై శంకర్ ఏమని స్పందిస్తాడో చూడాలి. ఇంకో నాలుగైదు రోజుల్లో సెట్స్ మీదికి వెళ్లాల్సిన సినిమాకు ఈ గొడవ ఎక్కడ బ్రేక్ వేస్తుందో అని నిర్మాత దిల్ రాజు టెన్షన్లో ఉన్నట్లు తెలుస్తోంది.
This post was last modified on September 4, 2021 11:35 am
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…