కప్పుడు బాలీవుడ్ వాళ్ల వైభం చూసి మిగతా ఇండస్ట్రీలకు కన్ను కుట్టేది. వాళ్ల మార్కెట్ పరిధి చాలా ఎక్కువ కావడంతో బడ్జెట్లు, వసూళ్లు, పారితోషకాలు చాలా ఎక్కువగా ఉండేవి. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు చాలా మారిపోయాయి. దక్షిణాది నుంచి వస్తున్న ప్రాంతీయ చిత్రాలు దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతూ హిందీ చిత్రాలకు పెద్ద ముప్పుగా మారాయి.
బాహుబలి, కేజీఎఫ్ లాంటి సినిమాల తర్వాత సౌత్ నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమాల సంఖ్య ఎలా పెరిగిపోయిందో తెలిసిందే. ఇదొక దెబ్బ అంటే.. కరోనా ప్రభావం నుంచి ఎంతకీ కోలుకోలేక బాలీవుడ్ పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
గత ఏడాదిన్నర వాళ్లకు థియేటర్ల నుంచి కనీస స్థాయిలో కూడా రెవెన్యూ రాలేదు. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత కొన్ని సినిమాలు నామమాత్రంగా రిలీజయ్యాయి. వాటికి ఏమాత్రం ఆశాజనకమైన ఫలితం రాలేదు. సెకండ్ వేవ్ తర్వాత కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయి.
ప్రతికూల పరిస్థితుల్లో ధైర్యం చేసి బెల్ బాటమ్, చెహ్రె లాంటి పేరున్న చిత్రాలను రిలీజ్ చేస్తే వసూళ్లు దారుణంగా ఉన్నాయి. దీంతో రిలీజ్ రేసులో ఉన్న సూర్యవంశీ, 83 లాంటి చిత్రాలను బయటికి తీయడానికి నిర్మాతలు భయపడుతున్నారు. పరిస్థితులు మెరుగు పడేదాకా చూద్దాం లేదంటే ఓటీటీలో రిలీజ్ చేసేద్దామన్న ఆలోచనకు నిర్మాతలు వెళ్తున్నారు. కానీ నార్త్ మార్కెట్ ఎప్పుడు పుంజుకుంటుందన్నదే తెలియడం లేదు. అక్షయ్ కుమార్ సినిమా చూడనపుడు సల్మాన్ ఖానో.. ఆమిర్ ఖానో తమ చిత్రాలను థియేటర్లలో రిలీజ్ చేస్తే మాత్రం ప్రేక్షకులు వచ్చి చూస్తారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో బాలీవుడ్ వాళ్ల చూపులు సౌత్ సినిమాలపై పడుతున్నాయి. రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’ను సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేస్తే అదైనా ఉత్తరాది ప్రేక్షకులను కదిలిస్తుందేమో.. థియేటర్ల వైపు పరుగులు పెట్టిస్తుందేమో అన్న ఆశలు కలుగుతున్నాయి. ఐతే ఈ చిత్రం ముందు అనుకున్నట్లు అక్టోబరు 13న రిలీజయ్యేలా లేదు. నార్త్ మార్కెట్ పరిస్థితి చూసే ఈ చిత్రాన్ని దసరా రేసు నుంచి తప్పించేశారు. సంక్రాంతికో వేసవివో వాయిదా అంటున్నారు. కానీ బాలీవుడ్ వాళ్లు మాత్రం ఈ చిత్రం సాధ్యమైనంత త్వరగా రిలీజై ఉత్తరాది మార్కెట్లో ఊపు తెస్తుందనే ఆశతో ఉన్నారు. ‘కేజీఎఫ్-2’ మీదా ఆశలు పెట్టుకున్నారు కానీ.. ఆ చిత్రాన్ని 2022 వేసవికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
This post was last modified on August 30, 2021 4:53 pm
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…
రాజాసింగ్... రాజకీయాల పట్ల కనీస పరిచయం ఉన్నవారికి ఎవరికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.…
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…
ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…