పవన్ కళ్యాణ్‌కు రికార్డుల వేట కొత్తేమీ కాదు. కాకపోతే గత కొన్నేళ్లలో పవన్ జోరు కొంచెం తగ్గిపోయింది. ‘అత్తారింటికి దారేది’ తర్వాత పవన్ స్థాయికి తగ్గ మాస్ ఎంటర్టైనర్ రాలేదు. సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి చిత్రాలు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లయి పవన్‌ను రేసులో వెనక్కి నెట్టేశాయి. రాజకీయాల కోసం రెండేళ్లకు పైగా విరామం తీసుకుని ఆ తర్వాత పవన్ చేసిన‘వకీల్ సాబ్’.. బాక్సాఫీస్‌కు అంత అనుకూల పరిస్థితులు లేని టైంలో విడుదలై ఉన్నంతలో మంచి ఫలితాన్నే అందుకుంది కానీ.. రికార్డులైతే బద్దలు కొట్టలేకపోయింది.
ఐతే పవన్ ప్రస్తుతం నటిస్తున్న హరిహర వీరమల్లు, భీమ్లానాయక్ చిత్రాలు మళ్లీ పవన్ సత్తా ఏంటో బాక్సాఫీస్‌కు రుచి చూపిస్తాయనే అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ‘భీమ్లా నాయక్’కు క్రేజ్ అలా ఇలా లేదు. ఈ మధ్యే రిలీజ్ చేసిన టీజర్ ఎలా ప్రకంపనలు రేపిందో తెలిసిందే. సంక్రాంతికి రాబోయే ఈ సినిమా కలెక్షన్లలో రికార్డులు నెలకొల్పేలాగే కనిపిస్తోంది.
ఈలోపు పవన్ సినిమా ఆడియో రికార్డుల పరంగా రికార్డు నెలకొల్పింది. ‘భీమ్లా నాయక్’ ఆడియో హక్కులు ఏకంగా రూ.5 కోట్లకు పైగా పలికి టాలీవుడ్లో కొత్త నాన్-బాహుబలి రికార్డుకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ఆదిత్య మ్యూజిక్ ‘భీమ్లా నాయక్’ ఆడియో హక్కులను ఈ రికార్డు రేటుకు సొంతం చేసుకుందట. జస్ట్ ఒక టీజర్ వదిలి ఈ సినిమా క్రేజ్‌ను పతకా స్థాయికి తీసుకెళ్లింది చిత్ర బృందం. టీజర్లో తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఎంత హైలైట్ అయిందో తెలిసిందే.
తమన్ కొన్నేళ్లుగా సూపర్ ఫాంలో ఉండటం.. అతడి ప్రతి ఆడియో బ్లాక్‌బస్టర్ అవుతుండటంతో ‘భీమ్లా నాయక్’ ఆడియో మీదా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా నుంచి తొలి పాటను పవన్ పుట్టిన రోజు కానుకగా సెప్టెంబరు 2న రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అది ఒక జానపద గేయం అని అంటున్నారు. ఆ పాటతో సహా ‘భీమ్లా నాయక్’ ఆడియో మొత్తం అదిరిపోతుందనే చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on August 30, 2021 4:46 pm
మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.. తాజాగా అటు తెలంగాణ, ఇటు ఏపీ నేతలపై సెటర్లు గుప్పించారు.…
కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి.…
ఇటీవలే సన్నీ డియోల్ జాట్ తో బాలీవుడ్లో అడుగు పెట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని తర్వాతి సినిమా బాలకృష్ణతో ఉండబోతోంది.…
ఏపీకి చెందిన క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల మరణంపై నెలకొన్న అస్పష్టతకు తెర పడిపోయింది. ఈ మేరకు ఏలూరు రేంజి…
ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే…
ఏపీలో రాముడి తరహా రామరాజ్యం తీసుకురావాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. రామరాజ్యం అంటే.. ఏపీ సమగ్ర అభివృద్ధి…