ఎన్నో అంచనాలతో మూడేళ్ల కిందట మొదలైన ‘ఇండియన్-2’ పరిస్థితి ఎలా తయారైందో తెలిసిందే. కమల్ మేకప్ విషయంలో సమస్యలు తలెత్తడం, ఆయన రాజకీయ కమిట్మెంట్లు, అలాగే షూటింగ్‌లో జరిగిన భారీ క్రేన్ ప్రమాదం, కరోనా మహమ్మారి.. ఇలా రకరకాల కారణాల వల్ల ఆ చిత్రానికి బ్రేకులు పడ్డాయి. క్రేన్ ప్రమాదం తర్వాత నిర్మాతలతో హీరో కమల్ హాసన్, దర్శకుడు శంకర్‌లకు తలెత్తిన విభేదాల వల్ల ఈ చిత్రం ముందుకే కదల్లేదు.
ఒక దశలో ఈ చిత్రం ఆగిపోయినట్లే అని వార్తలొచ్చాయి. కానీ ఇప్పటికే రూ.180 కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాతలు ఈ సినిమాను అటకెక్కించే సాహసం చేయలేకపోయారు. కానీ కమల్, శంకర్‌లతో వాళ్లకు తలెత్తిన విభేదాలు పరిష్కారం కాకపోవడంతో ఈ సినిమా తిరిగి పట్టాలెక్కలేకపోయింది. కొన్ని నెలలుగా ఈ సినిమా గురించి అప్‌డేట్సే లేవు. శంకర్.. దీన్ని పక్కన పెట్టేసి రామ్ చరణ్ సినిమాను మొదలుపెట్టేస్తుండటంతో ‘ఇండియన్-2’ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
ఐతే ఎట్టకేలకు ‘ఇండియన్-2’ గురించి ఒక సానుకూల వార్త బయటికి వచ్చింది. ఈ చిత్రం మధ్యలో ఆగిపోవడానికి ముఖ్య కారకుడిగా భావిస్తున్న కమల్ హాసనే ఈ అప్‌డేట్ ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘ఇండియన్-2’ త్వరలోనే పున:ప్రారంభం అవుతుందన్నారు. ఇప్పటిదాకా 60 శాతం చిత్రీకరణ పూర్తయిందని.. నిర్మాతలు, శంకర్‌తో మాట్లాడి విభేదాలు పరిష్కరించుకుని ఈ చిత్రాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తానని కమల్ తెలిపాడు.
క్రేన్ ప్రమాద బాధితులను ఆదుకునే విషయంలో నిర్మాతలు సరిగా స్పందించలేదని, ఆ ప్రమాదం జరగడానికి నిర్మాతల నిర్లక్ష్యమే కారణమని కమల్ వాదనకు దిగి షూటింగ్ పున:ప్రారంభించలేదని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ చిత్రం గురించి ఎటూ తేల్చకుండానే ఆయన ‘విక్రమ్’ను మొదలుపెట్టేశారు. కాబట్టే శంకర్ కూడా చరణ్ చిత్రంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు కమలే స్వయంగా విభేదాలు పరిష్కరించడానికి చొరవ తీసుకుంటానని, విక్రమ్ అవ్వగానే ఇండియన్-2ను పున:ప్రారంభించేందుకు ప్రయత్నిస్తానని చెప్పడంతో సమస్య దాదాపు తీరిపోయేలాగే కనిపిస్తోంది.
This post was last modified on August 23, 2021 5:59 pm
రాజాసింగ్... రాజకీయాల పట్ల కనీస పరిచయం ఉన్నవారికి ఎవరికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.…
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…
ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…