‘హృదయ కాలేయం’ చిత్రంలో టాలీవుడ్లోకి సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చాడు సంపూర్ణేష్ బాబు. బర్నింగ్ స్టార్ సంపూ అంటూ తనకు తానే ఒక బిరుదు ఇచ్చేసుకుని.. సోషల్ మీడియాలో నానా హంగామా చేసి అతను జనాల దృష్టిని ఆకర్షించాడు. తెలుగులో వచ్చే స్టార్ హీరోల సినిమాలకు పేరడీలా తీర్చిదిద్దిన ‘హృదయ కాలేయం’ ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి రేకెత్తించగలిగింది. ఐతే ఈ సినిమాతో వచ్చిన గుర్తింపును సంపూ సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. ఇదే కోవలో ‘సింగం 123’ సహా కొన్ని చిత్రాల్లో నటించాడు. అవేవీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయాయి. మధ్యలో వచ్చిన ‘కొబ్బరి మట్ట’ కొంచెం నయం.
తాజాగా సంపూ ‘బజార్ రౌడీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది అటు సెటైరికల్ మూవీలాగానూ లేదు. అలాగని సీరియస్‌గానూ తీసుకునే అవకాశం లేకపోయింది. కొన్ని దశాబ్దాల కిందట వచ్చిన మాస్ మసాలా సినిమాలాగానే తయారైంది. సెటైర్ లాగా చేద్దామనుకున్నా ఎక్కడా కూడా ఆ ప్రయత్నం ఫలించలేదన్నది ప్రేక్షకులు చెబుతున్న మాట. సంపూ నటన పరంగా తొలి సినిమాలో ఏం చేశాడో ఇప్పటికీ అదే చేస్తున్నాడు. అవి చూసి చూసి జనాలకు మొహం మొత్తేసింది. అల్లరి నరేష్ లాంటి వాడే పేరడీలతో ప్రేక్షకులకు చిరాకు తెప్పించేసి.. రూటు మార్చి వేరే సినిమాలు చేస్తున్నాడు.
ఈ జబర్దస్త్ కాలంలో ఇలాంటి స్పూఫులు, పేరడీలు నడిచే పరిస్థితి ఎంతమాత్రం లేదు. సంపూ వ్యక్తిగతంగా చాలా మంచోడని, తన స్థాయికి మించి మంచి పనులు చేస్తుంటాడని, కల్మషం లేని వాడని జనాల్లో మంచి పేరుంది. అందువల్లే ఇంకా అతడిని కాస్తో కూస్తో ఆదరిస్తున్నారు. ఈ గుర్తింపుతో కొంచెం భిన్నమైన పాత్రలేవైనా చేయడానికి ప్రయత్నించాలి. హీరో వేషాలు చాలించి క్యారెక్టర్ మీద దృష్టిపెడితే మంచిదేమో. హీరోగా చేసినా కూడా ఈ పేరడీలు, స్పూఫ్‌లు, బిల్డప్‌లు కట్టి పెట్టి ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నించాలి. లేకుంటే ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయిపోక తప్పదు.
This post was last modified on August 21, 2021 2:20 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…