60 ఏళ్ల వ్యక్తికి 20 ఏళ్ల అమ్మాయి భార్య కావడం మరీ విచిత్రమేమీ కాదు. చరిత్రలో ఇలాంటి ఉదంతాలు బోలెడు. ఇప్పటికీ వెనుకబడ్డ ప్రాంతాల్లో ఇలాంటివి జరుగుతుంటాయి. ఇక సినిమాల విషయానికి వస్తే 60 ఏళ్ల వ్యక్తికి 20 ఏళ్ల అమ్మాయి జోడీగా నటించడమూ చూడొచ్చు. కాకపోతే 60 ఏళ్లున్న హీరోలకు మేకప్ వేసి మేనేజ్ చేస్తుంటారు. కానీ ఏదైనా సినిమాలో 20 ఏళ్ల కుర్రాడికి 60 ఏళ్ల మహిళ భార్యగా కనిపించడం చూశారా? ఇదేం విడ్డూరం అనిపిస్తోందా? కానీ ఇప్పుడో సినిమా ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఆ చిత్రమే.. సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి.
‘కేరింత’ సినిమాతో మంచి పేరు సంపాదించిన పార్వతీశం కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ఇది. టైటిల్లోని సత్యమూర్తి ఇతనే. మరి సావిత్రి ఎవరో తెలుసా..? సీనియర్ కమెడియన్ శ్రీలక్ష్మి. కొన్నేళ్ల విరామం తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపిస్తున్న శ్రీలక్ష్మి ఈ చిత్రంలో లీడ్ రోల్ చేయడం విశేషం.
కుర్రాడైన పార్వతీశంకు శ్రీలక్ష్మి భార్యగా నటిస్తోంది ఈ చిత్రంలో. మరి వీళ్లిద్దరి వయసు అంతరం మాటేంటి? ఆమెకు జోడీగా ఇతనేంటి అనిపిస్తోంది కదా. అదే ఈ సినిమా కాన్సెప్ట్. 1980 ప్రాంతంలో వీళ్లిద్దరికీ పెళ్లి జరుగుతుందట. కానీ అప్పట్నుంచి హీరో వయసు పెరగకుండా 20 ఏళ్ల కుర్రాడిగానే ఉండిపోతాడు. అందులో మతలబు ఏంటన్నది సస్పెన్స్. సంవత్సరాలు.. దశాబ్దాలు గడుస్తున్నా వయసు పెరగకుండా కుర్రాడిగానే ఉంటూ అమ్మాయిలతో సయ్యాటలు ఆడుతుంటాడు హీరో. అతనెలా చిన్నవాడిలా ఉండిపోతున్నాడన్నది ఎవరికీ అర్థం కాదు. ఈ క్రమంలో జరిగిన పరిణామాలేంటన్న దానిపై ఈ కథ నడుస్తుంది.
‘సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి’ కాన్సెప్ట్ టీజర్ అయితే సరదాగానే అనిపిస్తోంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. మహేంద్ర క్రియేషన్స్ అనే బేనర్లో తెరకెక్కిన ఈ చిత్రానికి చైతన్య కొండా అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహించాడు.
This post was last modified on August 18, 2021 1:23 pm
బడ్జెట్ పరంగా పండగ సినిమాల్లో గేమ్ ఛేంజర్ పెద్దది కాగా సంక్రాంతికి వస్తున్నాం చిన్నది. స్టార్ స్టేటస్ పక్కనపెడితే ఇది…
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…