టాలీవుడ్లో దర్శకుడిగా అపజయం లేకుండా సాగిపోతున్న అతి కొద్దిమంది దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకడు. తొలి చిత్రం ‘పటాస్’తో మొదలుపెట్టి చివరగా చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ వరకు అతడి సినిమాలన్నీ సూపర్ హిట్లే. రొటీన్ మాస్ మసాలాలంటూ కొందరు అతడి సినిమాలపై విమర్శలు గుప్పించినా.. బాక్సాఫీస్ దగ్గర ప్రతిసారీ అతడి చిత్రాలు మంచి ఫలితాలనే అందుకుంటున్నాయి. ప్రస్తుతం అనిల్ ‘ఎఫ్-3’ తీస్తున్నాడు. దీని తర్వాత అనిల్ ఏ చిత్రం చేస్తాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
బాలయ్యతో పాటు మహేష్ బాబుతోనూ సినిమాలు చేయడానికి అనిల్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే యువి క్రియేషన్స్‌లో రామ్ చరణ్ హీరోగా అనిల్ ఓ సినిమా చేస్తాడని కూడా వార్తలొస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై క్లారిటీ ఇచ్చాడు అనిల్.
తన ఇమ్మీడియట్ మూవీ బాలయ్యతోనే అని అతను స్పష్టం చేశాడు. ఏ సంస్థలో చేసేది, సినిమా ఎప్పుడు మొదలవుతుంది అన్న విషయాలు చెప్పలేదు కానీ.. ‘ఎఫ్-2’ తర్వాత బాలయ్య సినిమానే ఉంటుందని మాత్రం అనిల్ స్పష్టం చేశాడు. మహేష్ బాబుతో తన రెండో సినిమా కూడా కచ్చితంగా ఉంటుందని.. తాను చెప్పిన కథ కూడా మహేష్‌కు నచ్చిందని.. ఐతే ఆయన డేట్లను బట్టి సినిమా ఉంటుందని అనిల్ తెలిపాడు. రామ్ చరణ్‌తో సినిమా గురించి అతనేమీ మాట్లాడలేదు.
ఇక ‘ఎఫ్-3’ గురించి చెబుతూ.. ఈ చిత్రానికి, ‘ఎఫ్-3’కి కథ పరంగా ఎలాంటి పోలీకా ఉండదన్నాడు. ‘ఎఫ్-2’లో భార్యాభర్తల మధ్య గిల్లి కజ్జాల నేపథ్యంలో కథ నడిస్తే.. ఇందులో పూర్తిగా డబ్బు చుట్టూ ఇతివృత్తం నడుస్తుందన్నాడు. ఐతే ఇందులోనూ ఫన్, ఫ్రస్టేషన్ ఉంటాయని.. అందరూ కలిసి కడుపుబ్బ నవ్వుకునేలా సినిమాను తీర్చిదిద్దుతున్నామని అనిల్ తెలిపాడు.
This post was last modified on August 8, 2021 1:30 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…