స్టార్ హీరో రామ్ చరణ్ తో సినిమా చేయాలని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. చరణ్ కూడా మంచి కథ దొరికితే యూవీ సంస్థతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చరణ్ కోసం కొన్ని కథలను సిద్ధం చేసి.. వాటిని వినిపించారు. కానీ చరణ్ కు మాత్రమే ఏదీ నచ్చలేదు. అయినప్పటికీ యూవీ క్రియేషన్స్ తన ప్రయత్నాలు మానుకోలేదు. సరైన కథను సెట్ చేయాలని చాలా మంది పేరున్న దర్శకులను సంప్రదించింది.
ఈ క్రమంలో ఓ కథను లాక్ చేసినట్లు సమాచారం. చరణ్ కి కూడా కథ నచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తోన్న చరణ్ తన తదుపరి సినిమా శంకర్ తో చేయనున్నారు. ఈ ఏడాదికల్లా శంకర్ సినిమాను పూర్తి చేయాలని ప్లాన్. ఆ తరువాత ఎవరితో సినిమా చేస్తారనే విషయంలో సందిగ్ధత నెలకొంది. కొందరు దర్శకుల పేర్లు వినిపించినప్పటికీ ఆ విషయంలో క్లారిటీ రాలేదు. ఇప్పుడు అనిల్ రావిపూడి పేరు బలంగా వినిపిస్తుంది.
ఆయన రెడీ చేసిన స్టోరీ అటు యూవీ సంస్థకు, ఇటు రామ్ చరణ్ కు నచ్చడంతో కథను లాక్ చేసేశారు. ఈ సినిమాలో నటించడానికి చరణ్ కూడా రెడీగానే ఉన్నారని టాక్. ‘ఆర్ఆర్ఆర్’, శంకర్ సినిమాల తరువాత ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటించాలనుకుంటున్నారు రామ్ చరణ్. ఆ తరహా కథను అనిల్ రావిపూడి బాగా డీల్ చేయగలడని చరణ్ నమ్ముతున్నారు. ముందుగా అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ సినిమాను పూర్తి చేయనున్నారు. ఆ తరువాత బాలయ్యతో సినిమా ఉంటుంది. అది పూర్తి కాగానే చరణ్ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates