రెండు దశాబ్దాల క్రితం హీరోగా ఎన్నో సినిమాలు చేసిన నటుడు వేణు తొట్టెంపూడి ప్రేక్షకులను అలరించారు. తన కామెడీ టైమింగ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ‘స్వయంవరం’, ‘చిరునవ్వుతో’, హనుమాన్ జంక్షన్’ లాంటి సినిమాలు వేణు కెరీర్ లో మంచి హిట్స్ గా నిలిచాయి. అయితే హీరోగా అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు వేణు. చివరిగా ‘దమ్ము’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించారు. దాదాపు పదేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న వేణు ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
రవితేజ హీరోగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శరత్ మండవ అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానున్నారు. ఈ సినిమాలో కీలకపాత్ర కోసం వేణుని సంప్రదించినట్లు తెలుస్తోంది. పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉండడంతో వేణు అంగీకరించారట. ఈ సినిమా గనుక క్లిక్ అయితే ఫ్యూచర్ లో వేణుని మరిన్ని సినిమాల్లో చూసే అవకాశం ఉంటుంది.
ఇక ఈ సినిమాలో రవితేజ సరసన ‘మజిలీ’లో సెకండ్ హీరోయిన్ గా నటించిన దివ్యంశ కౌశిక్ కనిపించనుంది. అలానే మలయాళ ముద్దుగుమ్మ రజిషాను మరో హీరోయిన్ గా తీసుకున్నారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా కంటే ముందు రవితేజ నటించిన ‘ఖిలాడి’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on July 29, 2021 1:42 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…