రూ.25లక్షల లంచం ఇచ్చిన శిల్పా శెట్టి భర్త?

ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఆయన ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి పోలీసులకు లంచం ఇచ్చినట్లు ఆరోపణలు వినపడుతున్నాయి.

రాజ్ కుంద్రా పై ఈ ఏడాది ఫిబ్రవరిలోనే కేసు నమోదు కాగా.. ఇప్పటి వరకు రాజ్ కుంద్రాను అరెస్టు చేయకపోవడానికి కారణమేంటా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే రాజ్ కుంద్రా.. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి పోలీసులకు రూ.25లక్షల వరకు లంచం ఇచ్చారట. అందుకే ఇంత కాలం అరెస్టు చేయలదనే ఆరోపణలు వినపడుతున్నాయి.

ముంబైలోని అవినీతి శాఖ అధికారులకు యాష్ ఠాకూర్ అనే వ్యక్తి మెయిల్ ద్వారా తెలిపాడని అంటున్నారు. కాగా.. ఈ విషయంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. రాజ్‌ కుంద్రా మాత్రం తానేమీ తప్పు చేయలేదని, కావాలని నన్ను ఇందులో ఇరికిస్తున్నారని వాదిస్తున్నాడు.

పోర్న్ చిత్రాల రాకెట్ విషయంలో ప్రధాన సూత్రధారి రాజ్‌ కుంద్రా అని పోలీసులు అంటున్నారు. ముంబై క్రైమ్ బ్రాంచి పోలీసులకు లంచం ఇచ్చాడన్న ఆరోపణలపై ఎవరూ నోరు మెదపడం లేదు.