తెలుగు, తమిళ సినీ అభిమానులు సోషల్ మీడియాలో కొట్టుకోవడం కొత్తేమీ కాదు. ఓవైపు వాళ్ల భాషల్లో హీరోల అభిమానులు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడంతో పాటు వేరే భాషల వాళ్లు కవ్వించినపుడు ఒక భాషలోని హీరోల అభిమానులందరూ ఒక్కటైపోయి అవతలి వాళ్లను ఢీకొనడమూ మామూలే. మా హీరోలు గొప్పంటే మా హీరోలు గొప్ప అని ట్వీట్లు వేసుకుంటూ.. అవతలి హీరోలను కించపరుచుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్లకు చిన్న సందర్భం వచ్చినా చాలు. ఇప్పుడు అలాంటి సందర్భమే వచ్చింది.
తమిళంలో ధనుష్ నటించిన ‘అసురన్’కు రీమేక్‌గా తెరకెక్కిన తెలుగు చిత్రం ‘నారప్ప’ అమేజాన్ ప్రైమ్ ద్వారా విడుదల కావడం తెలిసిందే. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది. ఐతే ఇదే అదనుగా తమిళ అభిమానులు రెచ్చిపోతున్నారు. ‘అసురన్’ ముందు ‘నారప్ప’ నిలవలేకపోయాడని.. ధనుష్ లాగా పెర్ఫామ్ చేయలేకపోయాడని విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి వెంకీ అభిమానులు దీటుగానే స్పందిస్తున్నారు. రెండు రోజులుగా ఈ గొడవ కొనసాగుతూనే ఉంది.
ఐతే ఈ గొడవలోకి ఇప్పుడు తెలుగు వారికీ చేరువైన తమిళ నటుడు సిద్దార్థ్ వచ్చాడు. ట్విట్టర్లో తెలుగు, తమిళ అభిమానులు తెగ కొట్టేసుకోవడం చూస్తున్నానని.. ఈ నేపథ్యంలో తనకో ఐడియా వచ్చిందని సిద్ధు అన్నాడు. నెట్ ఫ్లిక్స్ వాళ్లు ‘నెట్ ఫ్లిక్స్’ సౌత్ పేరుతో హ్యాండిల్ పెట్టారని.. సౌత్ పట్ల వారి చిన్నచూపుకు ఇది నిదర్శనమని.. మన దగ్గర నాలుగు భాషలుంటే.. నాలుగింటికి వేర్వేరుగా హ్యాండిల్స్ పెట్టకుండా హిందీ ముందు మనం తక్కువ అని చాటేలా ఇలా ‘సౌత్’ అంటూ అందరినీ ఒక గాటన కట్టేశారని.. ప్రస్తుతం ట్విట్టర్లో కొట్టేసుకుంటున్న తెలుగు, తమిళ అభిమానులు కుదిరితే దీని మీద పోరాడాలని సిద్ధు పిలునివ్వడం విశేషం.
This post was last modified on July 21, 2021 9:44 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…