Movie News

నిక్కర్ వేసుకోమన్నారని ‘గంగోత్రి’ చేయలేదట

‘పవర్’ సినిమాతో దర్శకుడిగా పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబీ. ఆ సినిమాతో మెగా ఫోన్ పట్టడానికి ముందే ‘బలుపు’ సహా కొన్ని సూపర్ హిట్ సినిమాలకు రచయితగా పని చేసి ఇండస్ట్రీలో మంచి పేరే సంపాదించాడు బాబీ.

ఐతే దర్శకుడిగా మారిన వాళ్లందరూ దాదాపుగా ఆ లక్ష్యంతోనే ఇండస్ట్రీలోకి వస్తారు. కానీ బాబీ మాత్రం ఏం కావాలో నిర్ణయించుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చేశాడట. అల్లు అర్జున్ తొలి చిత్రం ‘గంగోత్రి’తో అతను నటుడిగా పరిచయం కావాల్సిందట. కానీ ఆ సినిమా కోసం నిక్కర్ వేసుకోవాలని చెప్పడంతో తాను అందులో నటించలేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు బాబీ.
ఒకప్పుడు గుంటూరులో చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడైన బాబీ.. ‘ఇంద్ర’ సినిమా రిలీజ్ టైంలో తమ ఊరికి వచ్చిన రచయిత చిన్నికృష్ణ మాట వరసకు హైదరాబాద్‌కు వచ్చినపుడు కలవమని అన్నారని.. ఐతే ఆ మాట పట్టుకుని కొన్ని రోజుల్లో నిజంగానే ఆయన ఇంటికి వెళ్లినట్లు తెలిపాడు.

అప్పటికి చిన్నికృష్ణ ‘గంగోత్రి’ సినిమా చేస్తున్నారని.. సినిమాల్లో ఛాన్స్ కోసం ఆయన వెంట పడటంతో రాఘవేంద్రరావు దగ్గరికి పంపినట్లు బాబీ చెప్పాడు. తాను రాఘవేంద్రరావు వద్దకు వెళ్లగానే.. అసిస్టెంట్‌ను పిలిచి హీరో పక్కన ఉండే పాత్ర కోసం నిక్కర్ కొలతలు తీసుకోమన్నారని.. ఐతే నిక్కర్ వేసుకుని నటిస్తే గుంటూరులో తన పరువు పోతుందన్న ఉద్దేశంతో ఆ సినిమా చేయలేదని తెలిపాడు.

ఆ తర్వాత మళ్లీ చిన్నికృష్ణ దగ్గరికెళ్లానని, నటించకపోతే ఏం చేం చేస్తావు అని అడిగితే.. కథలు రాస్తా అని చెప్పానని.. కొన్ని రోజులకు ‘గంగోత్రి’లో ఒక కష్టమైన సన్నివేశం రాసి, రెండు రోజుల్లో తీసుకురమ్మని చెప్పారని.. కానీ తాను మధ్యాహ్నానికే ఆ సీన్ రాసి ఇచ్చేశానని.. అది నచ్చి తన రైటింగ్ టీంలోకి తీసుకున్నారని.. ఆ తర్వాత కొన్నేళ్లకు కోన వెంకట్ దగ్గర.. ఆపై దిల్ రాజు దగ్గర.. ఇలా చాలా చోట్ల పని చేసి రచయితగా ఓ స్థాయి అందుకున్నాక ‘బలుపు’ సినిమా చేస్తుండగా ఆ సినిమా హిట్టయితే దర్శకుడిగా అవకాశం ఇస్తానని రవితేజ మాట ఇచ్చాడని.. ఆ సినిమా పెద్ద హిట్టవడంతో అన్నట్లే ‘పవర్’ చేసి దర్శకుడిగా తనకు లైఫ్ ఇచ్చాడని బాబీ వెల్లడించాడు.

This post was last modified on July 11, 2021 3:41 pm

Share

Recent Posts

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

2 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

5 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

7 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

8 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

8 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

9 hours ago