Movie News

వెంకీ ఈ కాన్సెప్ట్ ను ఎలా హ్యాండిల్ చేస్తాడో!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది ఆయన నటించిన ‘కర్ణన్’, ‘జగమే తంత్రం’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ‘కర్ణన్’ సూపర్ హిట్ కాగా.. ‘జగమే తంత్రం’ నిరాశ పరిచింది. అయినప్పటికీ ధనుష్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మొదటినుండి కూడా సరికొత్త కథలను ఎన్నుకుంటూ తనలోని ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఇప్పటివరకు కోలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ధనుష్.. ఇప్పుడు ఇంగ్లీష్, హిందీ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు.

రీసెంట్ గా ఆయన టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసిన కొన్ని రోజులకే ధనుష్ మరో సినిమాకి అడ్వాన్స్ తీసుకున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థతో ధనుష్ ఓ సినిమా చేయడానికి అంగీకరించారు. ‘తొలి ప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ లాంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారని సమాచారం.

కథ కూడా ఓకే అయిపోయిందని సమాచారం. వెంకీ అట్లూరి ఇప్పటివరకు ప్రేమకథలను మాత్రమే తెరకెక్కించారు. అయితే ధనుష్ కోసం మాత్రం డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకున్నారట. విద్యా వ్యవస్థకు సంబంధించిన నేపథ్యంలో ఈ కథ ఉంటుందని.. ప్రస్తుతం ఈ వ్యస్థలో ఉన్న లోపాలను ఎండగట్టే విధంగా సినిమాను రూపొందించబోతున్నారని తెలుస్తోంది. ధనుష్ పాత్ర చాలా సీరియస్ ఎమోషన్స్ తో సాగుతుందని అంటున్నారు. దీన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లో తీయాలనుకుంటున్నారు. కానీ వెంకీ అట్లూరి లాంటి యంగ్ డైరెక్టర్ ఈ కాన్సెప్ట్ ను ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి!

This post was last modified on July 3, 2021 3:15 pm

Share

Recent Posts

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

1 hour ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

3 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

4 hours ago

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

5 hours ago

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

7 hours ago