విజయ్ దేవరకొండతో హరీష్ శంకర్..?

కరోనా కారణంగా సినిమాల నిర్మాణం ఆగిపోయింది. దీంతో దర్శకనిర్మాతలు, హీరోల ప్లానింగ్ ప్రకారం ఏదీ జరగడం లేదు. టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కూడా ముందుగా ‘లైగర్’ను పూర్తి చేసి ఆ తరువాత సుకుమార్ తో సినిమా చేయాలనుకున్నారు. కానీ ‘లైగర్’ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ పునః ప్రారంభించనున్నారు. అలానే సుకుమార్ తను రూపొందిస్తోన్న ‘పుష్ప’ సినిమాను రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నారు.

అంటే ఇప్పట్లో ఆయన ఫ్రీ అయ్యే ఛాన్స్ లేదు. ఎలా లేదన్నా.. వచ్చే ఏడాది చివరి వరకు సుకుమార్ బిజీగా ఉంటారు. అందుకే విజయ్ దేవరకొండ వేరే ఆప్షన్స్ కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో కొందరు దర్శకులు చెప్పే కథలు వింటున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. అలానే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై మరో సినిమా చేయనున్నారు.

ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ చేయబోయే సినిమాకి డైరెక్టర్ ని సెట్ చేసినట్లు సమాచారం. దిల్ రాజు ఆస్థాన దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఫ్యూచర్ లో విజయ్ దేవరకొండ సినిమా చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఇంకా చర్చల దశల్లోనే ఉంది. విజయ్ కి తగ్గ కథను హరీష్ శంకర్ రెడీ చేయగలిగితే.. ఈ కాంబినేషన్ మెటీరియలైజ్ అయ్యే అవకాశం ఉంది.