టాలీవుడ్ లో ఉన్న గొప్ప రచయితల్లో విజయేంద్ర ప్రసాద్ ఒకరు. ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న రైటర్స్ లో విజయేంద్రప్రసాద్ ముందు వరుసలో ఉంటారు. తన కొడుకు రాజమౌళి సినిమాలకు కథలు రాయడంతో పాటు బాలీవుడ్, కోలీవుడ్ లలో భారీ బడ్జెట్ సినిమాలకు కథలు అందిస్తున్నారు. ప్రస్తుతం ‘సీత’, ‘తలైవి’ అనే సినిమాలకు రచయితగా పని చేస్తున్నారు. మహేష్ బాబుతో రాజమౌళి చేయబోయే తదుపరి సినిమాకి కూడా కథ సిద్ధం చేశారు విజయేంద్రప్రసాద్.
ఇదిలా ఉండగా.. మొదటిసారి విజయేంద్రప్రసాద్ పవన్ కళ్యాణ్ కోసం ఓ స్క్రిప్ట్ రాసుకున్నారట. ఈ స్టార్ రైటర్ కి పవన్ కళ్యాణ్ మీద ఎంతో అభిమానం ఉంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కూడా పవన్ ను పొగుడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి పవర్ ఫుల్ స్టార్ ఇంకెవరు లేరని అంటుంటారు విజియేంద్రప్రసాద్. పవన్ పర్సనల్ క్యారెక్టర్ అంటే కూడా చాలా ఇష్టమని చెబుతుంటారు.
ఇప్పుడు పవన్ మీద ఉన్న అభిమానంతోనే ఓ కథ రాసుకొని ఆయనకి వినిపించారట. అది విన్న పవన్ వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఆ కథను ఎవరు డైరెక్ట్ చేస్తారు..? ఎవరు ప్రొడ్యూస్ చేస్తారనే విషయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ఓ పక్క అయ్యప్పన్ రీమేక్ లో నటిస్తూనే మరోపక్క ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం కసరత్తులు చేస్తున్నారు. ఈ సినిమాల తరువాత హరీష్ శంకర్ లైన్ లో ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో విజియేంద్ర ప్రసాద్ సినిమా కూడా చేరిందని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates