హీరోలు ప్రొడక్షన్లోకి దిగడం కొత్తేమీ కాదు. కొందరు నేరుగా నిర్మాణంలో అడుగు పెడితే.. కొందరు కుటుంబ సభ్యులను రంగంలోకి దించుతుంటారు. టాలీవుడ్లో దాదాపుగా అందరు స్టార్ హీరోలూ ఏదో రకంగా ప్రొడక్షన్‌తో టచ్ ఉన్న వాళ్లే. ఇప్పుడు మరో స్టార్ హీరో సొంత నిర్మాణ సంస్థను మొదలుపెట్టాడు. చాలా ఆలస్యంగా రంగంలోకి దిగిన ఆ హీరోనే మాస్ మహారాజా రవితేజ. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్న రవితేజ.. ఎట్టకేలకు ఇప్పుడు సొంత నిర్మాణ సంస్థకు శ్రీకారం చుట్టాడు.
తన పేరు కలిసొచ్చేలా ‘ఆర్‌టీ టీమ్ వర్క్స్’ అనే బేనర్‌ను మొదలుపెట్టాడు మాస్ రాజా. ఈ రోజే రవితేజ కొత్త చిత్రం ప్రి లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రవితేజకిది 68వ సినిమా. శరత్ మండవ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఎస్‌ఎల్వీ సినిమాస్ బేనర్ మీద సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఐతే పోస్టర్ మీద రవితేజ బేనర్ ‘ఆర్‌టీ టీమ్ వర్క్స్’ పేరు కూడా కనిపించింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు సహా కొందరు హీరోలు ఇలాగే సొంత బేనర్లు పెట్టి నిర్మాణ భాగస్వాములుగా మారడం తెలిసిందే. సొంతంగా సినిమాలను నిర్మించకపోయినా తమ పారితోషకాలనే పెట్టుబడిగా పెట్టి నిర్మాణ భాగస్వాములుగా మారడం.. లాభాల్లో వాటా తీసుకోవడం.. తమ ప్రొడక్షన్ టీం కొంచెం అనుభవం సంపాదించాక సొంతంగా సినిమాలు నిర్మించడం గమనించవచ్చు.
రవితేజ కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నట్లున్నాడు. ఒక కొత్త దర్శకుడు రూపొందిస్తున్న చిత్రంతో రవితేజ నిర్మాతగా మారడం విశేషమే. కొన్ని సూపర్ హిట్ సినిమాలకు రచయితగా పని చేసిన శరత్ మండవపై మంచి అంచనాలే ఉన్నాయి. అదిరిపోయే స్క్రిప్టుతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. అందుకు తగ్గట్లే ఇంట్రెస్టింగ్ ప్రి లుక్ పోస్టర్‌తో చిత్ర బృందం ఆసక్తి రేకెత్తించింది. గురువారమే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లింది. ఇందులో రవితేజ మేజిస్ట్రేట్ కార్యాలయంలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించనున్నాడు.
This post was last modified on July 1, 2021 2:53 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…