Movie News

కొత్త ‘హీరో’ పనికొస్తాడా?


టాలీవుడ్లోకి మరో యంగ్ హీరో అడుగు పెడుతున్నాడు. ఆ కుర్రాడి పేరు.. గల్లా అశోక్. టీడీపీ ఎంపీ, వ్యాపారవేత్త గల్లా జయదేవ్ కొడుకితను. మహేష్ బాబుకు మేనల్లుడు అవుతాడు. గత ఏడాదే అశోక్ తెరంగేట్రం గురించి ప్రకటించారు. సినిమాను మొదలుపెట్టారు. ఐతే కరోనా కారణంగా ఆ సినిమా అనుకున్న స్థాయిలో ముందుకు కదల్లేకపోయింది. త్వరలోనే సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తేవాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్ర టైటిల్‌ను ప్రకటిస్తూ టీజర్ వదిలారు.

ఈ సినిమాకు ‘హీరో’ అనే టైటిల్ ఖరారు చేశారు. మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమాల టైటిళ్లను ఈ మధ్య యంగ్ హీరోలు బాగా వాడేసుకుంటున్న సంగతి తెలిసిందే. చిరు సినిమా టైటిల్ అయిన ‘హీరో’ను ఇంతకుముందే నితిన్ వాడుకోగా.. ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఇప్పుడు అశోక్ చిత్రానికి ‘హీరో’ అని పెట్టుకున్నారు.

కొంచెం బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చే హీరో తొలి సినిమా అన్నాక ఫోకస్ అంతా లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, హావభావాలు ఎలా ఉన్నాయనే అందరూ చూస్తారు. ప్రోమోల్లో కూడా ఫోకస్ అదే ఉంటుంది. ‘హీరో’ విషయానికి వస్తే దీని కథేంటన్నది టీజర్లో పెద్దగా రివీల్ చేయలేదు. కొన్ని ఆసక్తికర షాట్స్ తీసుకుని అలా అలా చూపిస్తూ వెళ్లారు. ఫోకస్ అంతా అశోక్ మీదే నిలిచింది. ‘జోకర్’ సినిమాలో హీరో తరహా లుక్‌లో కనిపిస్తూ అదే మాదిరి హావభావాలు ఇచ్చే చోట అశోక్ ఆకట్టుకున్నాడు. టీజర్లో ఎక్కువ ఆసక్తి రేకెత్తించిన విషయం ఇదే. కథ కూడా దీని చుట్టూ ఏమైనా తిరుగుతుందేమో తెలియదు. కానీ టీజర్లో మాత్రం సంబంధిత షాట్లు హైలైట్ అయ్యాయి. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌ లాగే ‘హీరో’ను తీర్చిదిద్దే ప్రయత్నం జరిగినట్లుంది. టీజర్ వరకు అయితే అశోక్‌కు పాస్ మార్కులు పడతాయి.

This post was last modified on June 23, 2021 10:43 pm

Share

Recent Posts

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

1 hour ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

3 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

3 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

4 hours ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

4 hours ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

5 hours ago