ఒకే ఒక్క సినిమాతో ఒక హీరో ఇమేజ్ మారిపోయిన ఉదంతాలు చాలా చూసి ఉంటాం. ఐతే ‘బాహుబలి’తో ప్రభాస్‌కు వచ్చిన ఇమేజ్ మాత్రం అసాధారణమైంది. ఇలాంటి రైజ్ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఇంత వరకు చూసి ఉండం అంటే అతిశయోక్తి కాదు. ‘బాహుబలి’తో ప్రభాస్ మార్కెట్, అతడి సినిమాల బడ్జెట్, అలాగే బిజినెస్ పది రెట్లకు పెరగడం అసామాన్యం. ఇప్పుడు ప్రభాస్‌ను నమ్మి 400-500 కోట్ల దాకా బడ్జెట్ల పెట్టేస్తున్నారు నిర్మాతలు.
అతడి ఇమేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి నిర్మాతలే కాదు.. కంపెనీలు కూుడా క్యూ కట్టేస్తున్నాయి. అతడి క్రేజ్‌ను తమ బ్రాండ్ల ప్రచారానికి వాడుకోవాలని చూస్తున్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్లకు దీటుగా పారితోషకాలు ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నాయి. కానీ ప్రభాసే ఆ దిశగా అంతగా ఆసక్తి చూపట్లేదని తెలుస్తోంది. ‘బాహుబలి’ తర్వాత ఒక్క మహీంద్రా ప్రకటనలో మినహా మరెందులోనూ అతను కనిపించలేదు.
ఐతే గత రెండేళ్లలో ప్రభాస్ బోలెడన్ని బ్రాండ్లను తిరస్కరించాడని.. అందువల్ల దాదాపు రూ.150 కోట్ల ఆదాయాన్ని వదులుకున్నాడని బాలీవుడ్ మీడియాలో ఇప్పుడు వార్తలు వస్తుంటడం విశేషం. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే తరహా ఆలోచనలు ప్రభాస్ చేయట్లేదని.. ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్‌కు పని చేసి ఇమేజ్‌ను దెబ్బ తీసుకోదల్చుకోలేదని.. పైగా ప్రధానంగా తన ఫోకస్ అంతా సినిమాల మీదే పెట్టాలని ప్రభాస్ భావించాడని.. అందుకే ప్రకటనల్లో నటించడానికి అతను ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది.
కారణాలేవైనా కానీ.. ప్రభాస్ రూ.150 కోట్ల ఆదాయం వదులుకోవడం అన్నది ఇప్పుడు బాలీవుడ్లోనూ చర్చనీయాంశంగా మారింది. అతడి రేంజ్ గురించి కూడా అక్కడ చర్చించుకుంటున్నారు. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ లాంటి బాలీవుడ్ స్టార్లు రెండంకెల సంఖ్యలో బ్రాండ్లకు ప్రచారం చేస్తుంటారు. సినిమాల్లో వచ్చే ఆదాయం కంటే ఈ మార్గంలోనే వారికి ఎక్కువ ఆదాయం వస్తుంటుంది.
This post was last modified on June 23, 2021 10:37 pm
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న పలు నిర్ణయాలు ప్రవాస భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోన్న సంగతి…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం అల్లూరి సీతారామ రాజు జిల్లా పర్యటనకు వెళ్లారు. గిరి…
టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ కోసం ఏపీ కేబినెట్ చాన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్నట్లే ఉంది. ఎందుకంటే.. పయ్యావుల…
వచ్చే ఏడాది మార్చి 26, 27 తేదీల్లో క్లాష్ అయ్యేందుకు రెడీ అవుతున్న నాని ప్యారడైజ్, రామ్ చరణ్ పెద్దిల…
ప్రముఖ సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి జైలు కష్టాలను ఎలాగోలా తప్పించుకున్నా… గుంటూరులోని సీఐడీ…
ఈ నెల విడుదల కాబోతున్న నోటెడ్ సినిమాల్లో ఓదెల 2 బిజినెస్ పరంగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. టీజర్ రాక…