‘వకీల్ సాబ్’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ అలానే మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ కొంతవరకు జరగ్గా.. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా వేసుకున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు కొంచెం మెరుగు పడుతుండటంతో షూటింగ్‌లు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ కూడా తన సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ కోసం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో పోలీస్ స్టేషన్ సెట్ ను నిర్మించారు. ఈ సెట్ లో సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. జూలై 11 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అదే రోజు నుండి పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొనున్నారు. పవన్ తో పాటు రానా కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటారని తెలుస్తోంది.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో నిత్యామీనన్ కనిపించనుంది. సినిమాలో ఆమె కనిపించేది తక్కువ సేపే అయినప్పటికీ ఇంపాక్ట్ చూపించే విధంగా ఉంటుందని చెబుతున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకి అందిస్తోన్న మాటలు, స్క్రీన్‌ప్లే ప్రధాన ఆకర్షణగా నిలవడం ఖాయం. సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.
This post was last modified on June 19, 2021 4:16 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…