Movie News

ఏంటి మిల్కా గొప్పదనం?


దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ ఇక లేరు. ఇది భారత క్రీడాభిమానులకు వేదన కలిగించే విషయమే. ఈ తరం వాళ్లకు మిల్కా గొప్పదనం తెలియకపోవచ్చు. కానీ మిల్కా జీవితం గురించి, ఆయన సాధించిన ఘనతల గురించి కొంచెం లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆయనకు సలాం కొట్టకుండా ఉండలేం. కేవలం క్రీడాకారుడిగా సాధించిన ఘనతలు మాత్రమే ఆయన్ని గొప్పవాణ్ని చేసేయలేదు.

మిల్కా ఏ పరిస్థితుల నుంచి అంతర్జాతీయ స్థాయిలో మేటి అథ్లెట్ అయ్యాడో తెలుసుకుంటే ఆయనెంత గొప్పవారో అర్థమవుతుంది. కేవలం వికీపీడియాలో మిల్కా గురించి చదువుకుంటూ పోతే ఎమోషన్ ఏమీ ఉండదు. అందుకోసం ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా రూపొందించిన ‘బాగ్ మిల్కా బాగ్’ సినిమా చూడాలి. మిల్కా జీవితాన్ని అద్భుత రీతిలో ప్రెజెంట్ చేసిన చిత్రమిది.

దేశ విభజన సమయంలో పాక్ భూభాగంలో ఉన్న తమ గ్రామంపై ముస్లింలు జరిగిన దాడిలో తల్లిదండ్రులను కోల్పోయి.. ఆ తర్వాత శరణార్థిగా తన అక్కతో కలిసి భారత్‌కు వచ్చి.. యుక్త వయసులో చదువుకోకుండా దొంగతనాలు చేసుకుంటూ బతికి.. ఆపై తాను ప్రేమించిన అమ్మాయి కోసం సైన్యంలో చేరి.. అక్కడ పాలు, గుడ్డు ఇస్తారన్న ఒకే కారణంతో పరుగు పందేల్లో పోటీ పడి.. ఈ క్రమంలో అథ్లెటిక్స్ ఆసక్తి పుట్టి అందులో నైపుణ్యం సంపాదించి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడిగా ఎదిగిన అరుదైన నేపథ్యం మిల్కా.

ఈ విషయాలన్నింటినీ సినిమాలో ఎంతో హృద్యంగా.. ప్రేక్షకులను కదిలించేలా చూపించాడు రాకేష్ మెహ్రా. మిల్కా పాత్రలో ఫర్హాన్ నటించాడు అనడం కంటే జీవించాడు అని చెప్పొచ్చు. ఆ సినిమా చూశాక మిల్కా మీద ఎనలేని గౌరవ భావం ఏర్పడుతుంది. డాక్యుమెంటరీలా కాకుండా వినోదాత్మకంగా, ఉద్వేగభరితంగా సాగే ‘బాగ్ మిల్కా బాగ్’ తప్పక చూడాల్సిన చిత్రం. ఈ దిగ్గజ అథ్లెట్‌కు ఆ చిత్రం గొప్ప నివాళి అనడంలో సందేహం లేదు.

This post was last modified on June 19, 2021 1:27 pm

Share

Recent Posts

కీర్తి సురేష్ సినిమాని ఎందుకు నిషేధించారు

మనం ప్యారడైజ్ మేనియాలో పడిపోయాం కానీ తమిళంలో రేపు డోరోతి విడుదల కానుంది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో పేట…

3 hours ago

సితార సంస్థకు డబుల్ ప్రెజర్ ఉంటుందా

ఇతర ప్రొడక్షన్ హౌసెస్ దూకుడు తగ్గించి ఉండొచ్చేమో కానీ సితార ఎంటర్ టైన్మెంట్స్ మటుకు నెలకు కనీసం ఒక సినిమా…

3 hours ago

ఫౌజీ పరుగు ఎక్కడి దాకా వచ్చింది

డిసెంబర్ 3 నుంచి తప్పుకున్నాక ఫౌజీ ఎప్పుడు విడుదలవుతుందనే దాని మీద సందిగ్దత వీడలేదు. టీమ్ అధికారికంగా ప్రకటించనప్పటికీ ఇటీవలే…

4 hours ago

రెంటికీ చెడిపోయిన దానం… కింక‌ర్త‌వ్యం?!

దానం నాగేంద‌ర్‌.. దూకుడు మొత్తానికే ముస‌లం తెచ్చింది. ఆ.. ఏం చేసినా.. ఏం జ‌రుగుతుందిలే.. అని లైట్ తీసుకుని వేసిన…

4 hours ago

మ‌ల‌యాళంలో కంటే 6 రెట్లు అధిక పారితోష‌కం

ప‌ర భాషా న‌టులకు మ‌న ఫిలిం మేక‌ర్స్ ఇచ్చే ప్రాధాన్యం ఎలాంటిదో కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. ముఖ్యంగా తెలుగు…

4 hours ago

బూతులు తిట్టేవాళ్ల‌కు వాస్తవం చెప్పిన తేజు

అయిదేళ్ల ముందు టాలీవుడ్ యువ క‌థానాయ‌కుడు, మెగా ఫ్యామిలీ కుర్రాడు సాయిధ‌ర‌మ్ తేజ్ ఎంత పెద్ద ప్ర‌మాదానికి గుర‌య్యాడో గుర్తుండే…

6 hours ago