Political News

కవితకు… షర్మిలకు.. పోలికా?

కవితకు, షర్మిలకు మధ్య పోలిక పెట్టొద్దని ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్యూలో టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత స్పష్టం చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కవిత తెలంగాణా మాజీ మంత్రి కేటీఆర్ చెల్లెల్లు కాగా షర్మిల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు. ఈ ఇద్దరు వచ్చిన రాజకీయ నేపథ్యం గురించి నెటిజన్లు చర్చించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాజకీయాలలో రెండు ప్రధాన పార్టీలైన వైసీపీ, బీఆర్ఎస్ మధ్య ఒక విచిత్రమైన పోలిక వుంది. ఈ రెండూ పార్టీలకు రాజకీయంగానే కాకుండా కుటుంబ పరంగా ఒకే విధమైన సమస్యలు ఏర్పడటం కాకతాలీయమని చెప్పొచ్చు. తెలంగాణాలో 10 ఏళ్ళ పాటు అధికారం అనుభవించిన బీఆర్ఎస్ ఓటమి పాలై ప్రతిపక్షంలో కూర్చుంది. ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్లు అధికారంలో వున్న వైసీపీ 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలై ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది.

అన్న జగన్ తో ఆస్తి తగాదాల కారణంగా విభేదించిన షర్మిల వైసీపీ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి పీసీసీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. కవిత కూడా ఆస్తి తగాదాలతో పాటుగా రాజకీయ వారసత్వం విషయంలో తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ లకు కటీఫ్ చెప్పి తెరాస పేరుతో సొంత పార్టీ పెట్టుకుంది. ఈ క్రమంలోనే ప్రజలు కవిత, షర్మిలలను పోల్చి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇది కవితకు నచ్చడం లేదు.

ఈ విషయాన్ని టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్యూలో కవిత తీవ్రంగా ఖండించారు. షర్మిల నేపథ్యం వేరు నా నేపథ్యం వేరు, నేను తెలంగాణా ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చాను అని చెప్పుకున్నారు. ఎలాగైతే కెసిఆర్ పార్టీ పెట్టి సక్సస్ అయ్యారో అదే విధంగా నేను సక్సస్ అవుతాను అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణాలో కొత్త అధ్యాయం సృష్టించబోతున్నట్లు స్పష్టం చేశారు. పార్టీలు పెట్టి నడపటం చేతకాక వేరే పార్టీల్లో విలీనం చేసిన వారి గురించి తనకు అవసరం లేదన్నారు. తాను రాజీ రాజకీయాలు చేయడం లేదన్నారు. భవిష్యత్తులో తన ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ తో కలిసి పనిచేయనంటూ తేల్చి చెప్పారు.

కవిత ఇంటర్యూ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పోటీ చావో రేవో అన్నట్లు జరగబోతున్న తరుణంలో కవిత మాటలు కెసిఆర్ కోటలో ప్రకంపనలు సృష్టిస్తుంది. విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి వుంది. 2024 ఎన్నికల్లో జగన్ ఓటమికి షర్మిల కూడా ఒక కారణమేనన్న విశ్లేషణలు వచ్చాయి. రేపు 2029లో కూడా చెల్లెమ్మ షర్మిల అన్నయ్య జగన్ ఆశలకు గండి కొట్టే అవకాశం వుందని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

This post was last modified on August 16, 2026 8:04 pm

Share

Recent Posts

`అయోధ్య‌`కు రాజ‌కీయ గ్ర‌హ‌ణం వీడిన‌ట్టేనా?!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత రామ‌జ‌న్మ‌భూమి అయోధ్యలో ఉన్న బాల‌రామ‌య్య ఆల‌యానికి రాజ‌కీయ గ్ర‌హ‌ణం వీడిన‌ట్టేనా? ఇక‌, ఆల‌యానికి రాజకీయ ప్ర‌భావం,…

3 hours ago

సూర్య ఛెప్పిన కార్తి ‘పొటాటో చిప్స్’ కథ

సౌత్ ఇండియన్ సినిమాలో మోస్ట్ సెలబ్రేటెడ్ సినీ బ్రదర్స్‌లో సూర్య-కార్తి ద్వయం ముందు వరుసలో ఉంటుంది. వీళ్లిద్దరూ తండ్రి శివకుమార్…

3 hours ago

హీరో దర్శకత్వపు కల… అదెప్పుడు నెరవేరునో

టాలీవుడ్ కామెడీని కొత్త పుంతలు తొక్కించిన వాళ్ళలో జంధ్యాల, రేలంగి నరసింహరావు, సింగీతం శ్రీనివాసరావు తర్వాత ఈవివి సత్యనారాయణ తనకంటూ…

5 hours ago

సాక్షిలో రెండో పేజీకి చేరిన రాజన్న

ఇవ్వాళ సెప్టెంబర్ 2 వ తేదీ. వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. సరిగ్గా 17 ఏళ్ళ క్రితం 2009 సెప్టెంబర్…

6 hours ago

తెలంగాణా బీజేపీలో కారు లొల్లి

తెలంగాణా బీజేపీలో ఓ సెకండ్ హ్యాండ్ కారు రచ్చ రచ్చ చేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీని రోడ్డు…

7 hours ago

ఓజి యునివర్స్ ఊహించనంత పెద్దగా

ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అభిమానులు ఎదురు చూసిన కీలక అప్డేట్ ఓజి 2.…

8 hours ago