Movie News

విశాల్ నుంచి ఇలాంటి సినిమా ఊహించలేదు

కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే విశాల్ అంటే తమిళంలోనే కాదు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉండేది. పందెం కోడి, పొగరు, భరణి, భయ్యా ఇలా వరసగా హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా థియేటర్ బిజినెస్ ఎంజాయ్ చేశాడు. ఒకదశలో మినిమమ్ గ్యారెంటీగా బయ్యర్లు భావించే స్థాయికి చేరుకున్నాడు. కానీ అదంతా గతం. వరస ఫ్లాపులు విశాల్ ని బాగా ఇబ్బంది పెట్టాయి. అభిమన్యుడు విజయవంతమై కొంత రిలీఫ్ ఇచ్చినప్పటికీ కథ మళ్ళీ మొదటికే వచ్చింది. తాజాగా మకుటంతో పలకరించాడు.

మకుటం వరకు చూసుకుంటే ఇందులో ప్రత్యేకత ఏమిటంటే విశాల్ మొదటిసారి దర్శకత్వం చేశాడు. అగ్ర నిర్మాత ఆర్బి చౌదరి కన్నుమూయక ముందు ఓకే చేసిన ప్రాజెక్ట్ ఇది. బడ్జెట్ కూడా భారీగానే ఖర్చు పెట్టారు. అంజలి, దుసర విజయన్ హీరోయిన్లుగా నటించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకు జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. మార్నింగ్ షో నుంచే మకుటంకు నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోయింది. ఫస్ట్ డే కనీసం కోటి వసూలు చేయనంత వీక్ గా బోల్తా కొట్టింది.

ఇంతా చేసి విశాల్ ఎంచుకుంది కొత్త కథ కాదు. ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం వచ్చిన వారసుడు (ఇది కూడా రీమేకే) లో తండ్రి కొడుకులుగా నటించిన నాగార్జున – కృష్ణ పాత్రలను ఇందులో డ్యూయల్ రోల్ గా మార్చుకుని పాత చింతకాయ పచ్చడి ట్రీట్ మెంట్ తో ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టాడు. పైగా మూడు గంటల అయిదు నిమిషాల నిడివి ఇంకో పెద్ద మైనస్. ఇంటర్వెల్ దాకా అసలేం జరుగుతుందో, స్టోరీ ఎందుకు ముందు వెళ్ళదో అర్థం కానంత చికాకు పెడుతుంది.

ఇందులో విశాల్ బ్యాంక్ ఉద్యోగి, వయసైపోయిన డాన్ గా రెండు క్యారెక్టర్లు చేశాడు. ఫ్లాష్ బ్యాక్ కూడా రొటీన్ గా తేల్చేయడం చాలా ప్రతికూలంగా మారింది. యాక్షన్ ఎపిసోడ్లు అక్కడక్కడా కొంత డీసెంట్ అనిపించినా మిగిలినవి భరించలేనంత వీక్ గా ఉండటం ఇటు తెలుగు అటు తమిళ్ రెండు భాషల్లో కోరుకోని ఫలితాన్ని తెచ్చేలా ఉంది. ఒకవేళ సోలోగా వచ్చి ఉంటే ఎలా ఉండేదో కానీ విశ్వనాథ్ అండ్ సన్స్, డిసి, ఆవారాపన్ 2, కొరియన్ కనకరాజు మధ్య మకుటం నిలవడం  మహా కష్టమైపోతోంది. 

This post was last modified on August 16, 2026 12:26 pm

Share

Recent Posts

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

2 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

3 hours ago

వివాదాల డోరతి… మనోళ్లు ఇస్తారా హారతి

తమిళంలో తాజాగా విడుదలైన డోరతి అక్కడ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సమాజంలో ఈ మధ్య కాలంలో బాగా చర్చల్లోకి…

5 hours ago

వివేకా హ‌త్య: 40 కోట్ల రూపాయ‌లు ఎవ‌రివి?!

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసు వ్య‌వ‌హారంలో 40 కోట్ల రూపాయలు కీల‌కంగా…

6 hours ago

గణపయ్య ముందు ఖాకీలు కాలు కదిపితే…

వినాయక చవితిని అత్యంత ఘనంగా జరిపే రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటాయి. చవితి వచ్చిందంటే పది రోజుల…

6 hours ago