ఢీ, రెడీ, కింగ్, దూకుడు లాంటి చిత్రాలతో ఒకప్పుడు వైభవం చూసిన దర్శకుడు శ్రీను వైట్ల. అప్పటి టాప్ స్టార్లంతా ఆయనతో సినిమాలు చేయాలని తహతహలాడారు. కానీ ‘దూకుడు’తో కెరీర్ పీక్‌ను అందుకున్న ఆయన.. ఆ తర్వాత అంచనాలను అందుకోలేకపోయారు. ఎన్టీఆర్‌తో చేసిన ‘బాద్‌షా’ ఓ మాదిరిగా ఆడితే.. ఆ తర్వాత వరుసగా డిజాస్టర్లు ఎదురయ్యాయి. ఆగడు, బ్రూస్‌లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ ఎంత దారుణమైన ఫలితాలను అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ‘విశ్వం’ అనే సినిమా తీస్తే అది కూడా ఆడలేదు. ఆ సినిమా చూశాక వైట్ల బౌన్స్ బ్యాక్ అవడం అసాధ్యమన్న భావన కలిగింది. ఆయన ఇంకో సినిమా దక్కించుకోవడం కష్టమే అనుకున్నారంతా. కానీ శర్వానంద్ లాంటి ఫామ్‌లో ఉన్న హీరోతో సినిమా ఓకే చేసుకోవడమే కాదు.. ఈ ప్రాజెక్టు కోసం నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు ఎగబడే పరిస్థితి తీసుకురాగలగడం ఆశ్చర్యం కలిగించే విషయం.
శ్రీను వైట్ల, శర్వానంద్ కలయికలో మొదలైన ‘జార్జ్ క్రిష్’ సినిమాను సీనియర్ నిర్మాత అనిల్ సుంకర ఏరికోరి దక్కించుకోవడం విశేషం. నిజానికి ఈ సినిమా వేరే బేనర్లో తెరకెక్కాల్సింది. ఈ మేరకు మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. ఐతే గతంలో ఒక ఇంటర్వ్యూలో అనిల్ మాట్లాడుతూ.. శ్రీను వైట్ల ఈ సినిమా కథను తనతో పంచుకున్నాడని, తాను ఈ సినిమాను నిర్మిస్తే బాగుంటుందని ఆశించానని చెప్పారు. ఐతే అనూహ్యంగా చివరికి ఈ చిత్రం ఆయన చేతుల్లోకే వచ్చింది.
ఈ సినిమాకు మొన్ననే ప్రారంభోత్సవం జరపగా.. అదే రోజు వచ్చే జనవరి 14కు రిలీజ్ డేట్ ఇవ్వడమే కాదు, ఈ సినిమాను ఏ ఏరియాలో ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నది కూడా ప్రకటించేశారు అనిల్ సుంకర. నైజాంలో ఏషియన్ సురేష్ లాంటి టాప్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ చిత్రాన్ని పంపిణీ చేయనుంది. మిగతా మేజర్ ఏరియాలకు కూడా డిస్ట్రిబ్యూర్లు కన్ఫమ్ అయ్యారు. వేరే బేనర్లో తెరకెక్కాల్సిన సినిమాను కోరి దక్కించుకోవడం.. మొదలైన రోజే రిలీజ్ డేట్, డిస్ట్రిబ్యూటర్లను ఫిక్స్ చేయడం లాంటి పరిణామాలు చూస్తే ఈ సినిమాకున్న క్రేజ్ అర్థమవుతోంది. వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న వైట్ల కొత్త చిత్రానికి ఇంత డిమాండ్ ఏర్పడడం ఆశ్చర్యకరమే.
This post was last modified on August 16, 2026 4:50 pm
శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరు చెప్పగానే అందరికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…
నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…
నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…
వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…
సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…
https://twitter.com/GulteOfficial/status/2103820050603864546