టాలీవుడ్లో అత్యంత డిమాండ్ ఉండే షార్ట్ సీజన్.. సంక్రాంతి. ఈ టైంలో వచ్చే సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే వసూళ్ల మోత మోగిపోతుంది. అందుకే ఈ సీజన్లో తమ చిత్రాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు పోటీ పడుతుంటారు. ప్రతి సంవత్సరం నాలుగుకు తక్కువ కాకుండా సినిమాలు రిలీజవుతున్నాయి ఈ పండక్కి. ఈ ఏడాది మన శంకర వరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి వాటి వాటి స్థాయిలో భారీ విజయాలు అందుకోవడంతో తర్వాతి సంక్రాంతికి పోటీ మరింత పెరిగేలా కనిపిస్తోంది.
ప్రస్తుతానికి పరిస్థితి చూస్తే అరడజను సినిమాలకు తక్కువ కాకుండా పోటీలో కనిపిస్తున్నాయి. వరుసగా మూడో సంక్రాంతికి తన సినిమాను తీసుకురావడానికి అనిల్ రావిపూడి ఆల్రెడీ ఫిక్సయిపోయాడు. అతను విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్క లయికలో రూపొందిస్తున్న సినిమా సంక్రాంతికి రావడం పక్కా. ఇంకోవైపు గతంలో సంక్రాంతికే వచ్చి ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి, బాబి కొల్లి కాంబినేషన్లో రానున్న కొత్త చిత్రాన్ని కూడా సంక్రాంతికే అనుకుంటున్నారు.
తాజాగా మొదలైన శర్వానంద్, శ్రీను వైట్లల సినిమాకు నేరుగా సంక్రాంతి రిలీజ్ డేట్ ఇచ్చేశారు. జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఇక లేటెస్ట్‌గా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్ మూవీ ‘మహంకాళి’ని సంక్రాంతి పోటీలోకి తెచ్చారు. ఇక ఊహించని విధంగా సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా ‘సంబరాల యేటిగట్టు’ కూడా సంక్రాంతి విడుదలను టార్గెట్ చెయ్యడం గమనార్హం. ఐతే చిరు సినిమా పోటీలో ఉండగా అది ఆ పండక్కి వస్తుందా అన్నది డౌట్.
ఒకవేళ చిరు చిత్రం సంక్రాంతికి రాదనే సమాచారం ఉంటే తేజు మూవీని అప్పుడే రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. ఇక కింగ్ నాగార్జున వందో సినిమా కూడా పండుగ రేసులో ఉంటుందని అంటున్నారు. కానీ ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా ఏ అప్‌డేట్ లేదు. నెలాఖర్లో నాగ్ పుట్టిన రోజుకు క్లారిటీ రావచ్చు. ఒక దశలో బాలయ్య కొత్త చిత్రాన్ని కూడా సంక్రాంతికి అనుకున్నారు కానీ.. నందమూరి హీరో గాయం వల్ల ఆ చిత్రం వేసవికి వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా వచ్చే సంక్రాంతి సినిమాల విషయంలో అప్పుడే హౌస్ ఫుల్ బోర్డు పెట్టేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
This post was last modified on August 16, 2026 12:31 pm
గత దశాబ్ద కాలంలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ సినిమాల్లో ‘విక్రమ్ వేద’ ఒకటి. వినూత్నమైన కథ..…
కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే విశాల్ అంటే తమిళంలోనే కాదు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉండేది. పందెం కోడి,…
గత వారం విడుదలైన డిసికి ముందు రోజు వరకు పెద్దగా అంచనాలు లేవు. లోకేష్ కనగరాజ్ దర్శకుడిగా ఎంత ఫాలోయింగ్…
నిన్న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వచ్చిన నేషనల్ హాలిడే బాక్సాఫీస్ కు సూపర్ గా కలిసి వచ్చింది. మాములుగానే వీకెండ్…
నాగచైతన్య నటిస్తున్న మిథికల్ అడ్వెంచర్ 'వృషకర్మ' రిలీజ్ డేట్ మీద గత కొద్ది రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ…
'ఫౌజీ' సినిమా నుంచి ఇప్పటిదాకా వచ్చిన పోస్టర్లు చూస్తుంటే మేకర్స్ ఇంటెన్షన్ క్లియర్ గా అర్థమవుతోంది. ప్రభాస్ ను సాఫ్ట్…