కరోనా సెకండ్ వేవ్ ఇచ్చిన షాక్ నుంచి దేశం ఇంకా కోలుకున్నది లేదు. సెప్టెంబరు చివరి వారంలో లేదంటే.. అక్టోబరులో మూడో వేవ్ ముంచుకొస్తుందన్న అంచనాలు ఇప్పటివరకు ఉన్నాయి. అందుకు భిన్నంగా మరోనెలలోనే ఆ ముప్పు ఉందంటూ తాజాగా విశ్లేషణులు మొదలయ్యాయి. సెకండ్ వేవ్ తీవ్రత తగ్గి.. ఇప్పుడిప్పుడే జనజీవన స్రవంతి షురూ అవుతున్న వేళలో.. మూడో వేవ్ కు సంబంధించిన కీలక అలెర్టును మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. దీంతో మూడో వేవ్ కు మనమెంతో దూరంలో లేమన్న విషయం స్పష్టమవుతోంది.
ఇప్పటికే మొదటి..రెండో వేవ్ లతో తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రంగా మహారాష్ట్రను చెప్పాలి. మూడో వేవ్ సైతం ఆ రాష్ట్రం నుంచే షురూ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా మూడో వేవ్ రావొచ్చని అంచనా వేసింది. ఇందుకు కారణాల్ని వెల్లడించింది.
లాక్ డౌన్ ను సడలిస్తున్న నేపథ్యంలో.. ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వస్తున్నారని.. ఈ నేపథ్యంలో మరో నెలలోనే మూడో వేవ్ ముంచుకు వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. రాష్ట్రంలో మూడో వేవ్ తీవ్రంగా ఉండొచ్చని.. తక్కువలో తక్కువ 8 లక్షల మంది యాక్టివ్ కేసులు ఉండొచ్చని.. బాధితుల్లో 10 శాతం మంది పిల్లలు ఉండే అవకాశం ఉందంటున్నారు.
మహారాష్ట్రలో తొలి వేవ్ లో 19 లక్షలు.. రెండో వేవ్ లో 40 లక్షలు నమోదు కావటం తెలిసిందే. ఇక.. మూడో వేవ్ విషయానికి వస్తే.. ఈసారి 80 లక్షల మంది వరకు మూడో వేవ్ లో మహమ్మారి బారిన ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. దీనికి తగ్గట్లుగా రాష్ట్ర ప్రభుత్వం బెడ్లు.. ఆక్సిజన్.. మందులు సిద్ధంగా ఉంచుకోవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఆదేశించారు. మరోమూడు నెలల వ్యవధి ఉందనుకున్న వేళ.. మూడో వేవ్ మరో నెలలోనే ముంచకొస్తుందన్న మాట భయాందోళనల్ని కలిగించటం ఖాయం. ఏమైనా.. ఎవరికివారు తీసుకునే జాగ్రత్తలే శ్రీరామరక్షగా చెప్పాలి.
This post was last modified on June 19, 2021 1:35 pm
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రూటు మాసరుస్తున్నారా..? నిన్నా మొన్నటి వరకు ప్రధాని మోదీకి నమ్మకమైన వ్యక్తిగా కొనసాగిన…
పంజాబ్‌లోని పాటియాలా జిల్లాలో ఉన్న చిత్కార యూనివర్సిటీలో దెయ్యం ఉందంటూ సోషల్ మీడియాలో వ్యాపించిన ఒక పుకారు తీవ్ర ఉద్రిక్తతకు…
ఒక పార్టీపై చర్యలు తీసుకున్నా.. ఒక పార్టీ నాయకుడిపై చర్యలు తీసుకున్నా.. సహజంగానే ప్రజల్లో అంతో ఇంతో సింపతీ దక్కుతుంది.…
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజకీయాలు కూటమిలోనే అంతర్గత వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ఈ నియోజకవర్గం పూర్తిగా పట్టణ పరిధిలో ఉంది.…
ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…