దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు మిలింద్ రావు కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘నెట్రికన్’. మొన్నామధ్య ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు. కొరియన్ థ్రిల్లర్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో నయనతార అంధురాలిగా కనిపించనుంది. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీలో నేరుగా రిలీజ్ కాబోతుందని సమాచారం.
ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ హాట్ స్టార్ ఈ సినిమా రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం రూ.15 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం చర్చలు చివరి దశలో ఉన్నాయి. ఒక్కసారి డీల్ క్లోజ్ అయితే జూలైలో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను నయనతార బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ నిర్మించారు. నయన్ కూడా పెట్టుబడులు పెట్టిందని కోలీవుడ్ వర్గాల సమాచారం.
పెట్టిన బడ్జెట్ తో పోల్చుకుంటే హాట్ స్టార్ సంస్థ మంచి డీల్ ఆఫర్ చేసిందని అంటున్నారు. త్వరలోనే అగ్రిమెంట్ పై సంతకం చేయబోతున్నారని సమాచారం. గతేడాది నయన్ నటించిన ‘అమ్మోరు’ సినిమాను కూడా హాట్ స్టార్ లోనే రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆమె నుండి మరో సినిమా రాబోతుంది. ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇందులో నయన్ తో పాటు అజ్మల్, మణికందన్ ముఖ్యపాత్రలు పోషించారు.
This post was last modified on June 13, 2021 6:41 pm
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…