పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్లో పెడుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘వకీల్ సాబ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ ప్రస్తుతం క్రిష్ రూపొందిస్తోన్న ‘హరిహర వీరమల్లు’, అలానే ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ లో నటిస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తుండడం.. రానా లాంటి హీరోతో పవన్ తలపడడం వంటి అంశాలు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో దర్శకుడు వి.వి.వినాయక్ క్యామియో రోల్ పోషించినట్లు సమాచారం. ఇటీవలే ఆయన సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందట. నిజానికి మలయాళంలో వెర్షన్ లో ఈ సన్నివేశాల్లో ఒరిజినల్ డైరెక్టర్ సాచీ కనిపించారు. అదే రోల్ ను తెలుగులో వినాయక్ తో చేయించారు. రానా, వినాయక్ ల మధ్య కాంబినేషన్ సీన్ ఉంటుందని తెలుస్తోంది. పోలీసులతో గొడవ పడొద్దంటూ రానాకి సలహా ఇచ్చే పాత్రలో వినాయక్ కనిపించనున్నారు.
వినాయక్ క్యామియో రోల్ పోషించడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఆయన డైరెక్ట్ చేసిన ‘ఠాగూర్’, ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాల్లో ఒక్కో సీన్ లో తళుక్కున మెరిశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో కనిపించే ఛాన్స్ రావడంతో ఆయన వెంటనే ఓకే చెప్పి.. తన సన్నివేశానికి సంబంధించిన చిత్రీకరణలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పాత్ర పోషిస్తుండగా.. రానా ఆర్మీ రిటైర్ట్ హవల్దార్‌గా కనిపించనున్నారు. సినిమాలో వీరిద్దరి మధ్య సన్నివేశాలు హోరాహోరీగా ఉండబోతున్నాయని అంటున్నారు.
This post was last modified on June 9, 2021 2:51 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…