ఆర్ఆర్ఆర్ విడుదల మరోసారి వాయిదా పడటం అనివార్యమని దాదాపు అందరూ మానసికంగా సిద్ధమైపోయి ఉన్నారు. కాకపోతే దీనిపై అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది. చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య ఓ ఇంగ్లిష్ డైలీతో మాట్లాడుతూ.. ఇంకా 30 శాతం చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలి ఉన్న నేపథ్యంలో సంక్రాంతి రిలీజ్ డేట్‌ను అందుకోవడం కష్టమే అని తేల్చేశాడు.
ఏ రకంగా చూసినా వచ్చే జనవరి 8కి ‘ఆర్ఆర్ఆర్’ రావడం కష్టమే అని స్పష్టమవుతోంది. మరి కొత్త రిలీజ్ డేట్ ఏంటి అంటే.. ఆ ప్రశ్నకు ఇప్పుడే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. లాక్ డౌన్ పూర్తిగా ఎత్తి వేసి సాధారణ పరిస్థితులు నెలకొన్నాక కానీ దీనిపై స్పష్టత రాకపోవచ్చు. బహుశా 2020 వేసవి చివర్లో సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఐతే రిలీజ్ విషయంలో నిరాశ కలిగించే మాట చెప్పినా.. ఎన్టీఆర్ అభిమానులకు మాత్రం ఒక తీపి కబురు చెప్పారు దానయ్య. ఈ నెల 20న తారక్ పుట్టిన రోజు సందర్భంగా టీం నుంచి ఓ సర్ప్రైజ్ అయితే ఉంటుందని.. అభిమానులకు అది ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని చెప్పారు. కాబట్టి ఎన్టీఆర్ అభిమానులు ధీమాగా ఉండొచ్చు. కాకపోతే నెలన్నర కిందట వచ్చిన రామ్ చరణ్ పుట్టిన రోజు వీడియోతో మాత్రం దీన్ని పోల్చుకునే ప్రయత్నం చేయకూడదు.
ఎందుకంటే అది అన్ని వనరులూ అందుబాటులో ఉండగా పక్కాగా ప్లాన్ చేసి తీర్చిదిద్దిన వీడియో. కానీ తారక్ పుట్టిన రోజు ముందు చాలా పరిమితులున్నాయి. టీజర్ కోసం ప్లాన్ చేసిన విజువల్స్ తీయలేకపోయారు. కాబట్టి చరణ్ వీడియోలా ఇది ఉండదన్నది మాత్రం స్పష్టం. మరి ఎన్టీఆర్ అభిమానుల్ని మురిపించేందుకు జక్కన్న ఏం ప్లాన్ చేస్తాడు.. వారిని ఎలా సంతృప్తి పరుస్తాడు అన్నది ఆసక్తికరం.
This post was last modified on May 18, 2020 4:41 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…