పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత బండ్ల గణేష్ కు ఉన్న బంధం గురించి తెలిసిందే. పవన్ ని దేవుడిలా కొలుస్తుంటారు బండ్ల గణేష్. ఎప్పటికప్పుడు పవన్ పై తనకున్న అభిమానాన్ని చాటేలా పోస్ట్ లు చేస్తుంటారు. పవన్ కి సంబంధించిన ప్రతీ ఈవెంట్ లో బండ్ల గణేష్ ఉండాల్సిందే. ‘వకీల్ సాబ్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో పవన్ ను ఉద్దేశిస్తూ.. బండ్ల గణేష్ ఇచ్చిన స్పీచ్ ను అభిమానులు అంత సులువుగా మర్చిపోలేరు. పవన్ రీ ఎంట్రీలో వరుస సినిమాలు అంగీకరిస్తుండడంతో బండ్ల గణేష్ కూడా ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. పవన్ తనయుడు అకీరా నందన్ ను బండ్ల గణేష్ లాంచ్ చేస్తారా..? అనే విషయం ఇప్పుడు ట్విట్టర్ లో చర్చనీయాంశంగా మారింది. దానికి కారణం ఏంటంటే.. ఈరోజు పవన్ కళ్యాణ్, అకీరా కలిసి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తండ్రిని మించిపోయిన అకీరా హైట్ ను చూసుకుంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. పలు కామెంట్స్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
ఈ ఫోటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన బండ్ల గణేష్.. ”నా దేవుడుతో నా హీరో” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ తన దేవుడైతే.. అకీరాను తన హీరోగా అంటూ పరోక్షంగా చెప్పారు బండ్ల గణేష్. ఈ పోస్ట్ చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు అకీరాను లాంచ్ చేస్తున్నారా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే అకీరాకు ప్రస్తుతం సినిమాల మీద పెద్దగా ఆసక్తి లేదని.. మ్యూజిక్, కవితలపై ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాడని గతంలో రేణుదేశాయ్ వెల్లడించారు. ఒకవేళ తన కొడుకు హీరో అవుతానంటే కచ్చితంగా సపోర్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు.
This post was last modified on June 1, 2021 8:54 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…