భారతీయ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్-2. ఇండియన్ వెబ్ సిరీస్‌ల చరిత్రలోనే ఇది బిగ్గెస్ట్ హిట్ అనడంలో మరో మాట లేదు. రెండేళ్ల కిందటే అమేజాన్ ప్రైమ్‌లో రిలీజైన ఈ సిరీస్‌కు గొప్ప ఆదరణ లభించింది. గత రెండేళ్లలో భారీ సంఖ్యలో ప్రేక్షకులు ఈ సిరీస్‌ను వీక్షించారు. అది చూసినప్పటి నుంచి సెకండ్ సీజన్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఐతే ఏడాది కిందటే రావాల్సిన ఫ్యామిలీ మ్యాన్-2 కొవిడ్ కారణంగా ఆలస్యమైంది. ఈ ఏడాది ఆరంభంలో రెండో సీజన్‌ను విడుదలకు సిద్ధం చేయగా.. అప్పుడు తాండవ్ సహా కొన్ని సిరీస్‌ల విషయంలో వివాదాలు తలెత్తడంతో అమేజాన్ ఈ సిరీస్‌ను వాయిదా వేసింది. కొంచెం గ్యాప్ ఇచ్చి జూన్ 4న ఫ్యామిలీ మ్యాన్-2ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసింది. ఇటీవలే ట్రైలర్ కూడా లాంచ్ చేసింది.
ఫ్యామిలీ మ్యాన్-2 ట్రైలర్ మెజారిటీ ప్రేక్షకులకు నచ్చింది కానీ..అందులో సమంత పాత్ర విషయంలో తమిళులకు మాత్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఎల్టీటీఈ బ్యాక్ డ్రాప్‌లో సినిమా తీసినా, వెబ్ సిరీస్ తీసినా తమిళులకు నచ్చదు. తమిళ టైగర్లను నెగెటివ్ రోల్‌లో చూపిస్తే వాళ్లు ఒప్పుకోరు. ఫ్యామిలీ మ్యాన్-2 విషయంలోనూ వీరి అభ్యంతరాలు ఇవే. ట్రైలర్ లాంచ్ అయినపుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తమిళులు విమర్శనాస్త్రాలు గుప్పించారు. కరోనా టైం కాబట్టి ఊరుకున్నారు కానీ.. లేదంటే బయట ఆందోళనలు కూడా జరిగేవేమో. ఐతే అలాగని ఈ సిరీస్‌ను అంత తేలిగ్గా వదిలేలా లేరు. వైగో అనే ఎంపీ ఫ్యామిలీ మ్యాన్-2 విషయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ఈ సిరీస్‌ను ఆపాలంటూ కేంద్ర సమాచార ప్రసార శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు లేఖ రాశారు. సమంత పాత్ర తమిళుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉందని ఆయన ఆక్షేపించారు. ఇలా రాజకీయ నాయకుల జోక్యం మొదలవడంతో జూన్ 4న ఫ్యామిలీ మ్యాన్-2 సీజన్-2 అనుకున్న ప్రకారం విడుదలవుతుందో లేదో అన్న సందేహాలు కలుగుతున్నాయి.
This post was last modified on May 23, 2021 7:19 pm
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…