అల్లు అర్జున్ నటుడిగా తొలిసారి తెరపై కనిపించిన సినిమా ‘డాడీ’. అప్పటికతను టీనేజీలో ఉన్నాడు. ఆ సినిమా రిలీజయ్యాక కూడా తన పేరు అల్లు అర్జున్ అని, అతను అరవింద్ కొడుకని చాలామందికి తెలియదు. ఇక అల్లు అర్జున్ హీరోగా పరిచయం అయిన చిత్రం ‘గంగోత్రి’ అన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ఉన్నంతలో మంచి విజయమే సాధించింది. అయినా సరే.. బన్నీకి పెద్దగా గుర్తింపేమీ రాలేదు. అలాంటి సమయంలో సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటించిన ‘ఆర్య’ అతడి రాతను మార్చేసింది.
ఈ సినిమా మెగా హిట్టవ్వడమే కాదు.. బన్నీని ప్రేక్షకులకు సరికొత్తగా పరిచయం చేసింది. తన టాలెంట్ ఏంటో చూపించింది. ఈ సినిమాతో ఒక్కసారిగా బన్నీ స్టార్ అయిపోయాడు. ఇక ఆ తర్వాత అతను వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అందుకే ‘ఆర్య’ బన్నీకి ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ సినిమా విడుదలై శుక్రవారానికి 17 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రతి ఏడాది లాగే బన్నీ ఈసారి కూడా ఎమోషనల్ అయ్యాడు. కాకపోతే ఇటీవలే కరోనా బారిన పడటం.. రెండు వారాలుగా ఇంటి పట్టునే ఉండటంతో ఈసారి బన్నీలో ఎమోషన్ పాళ్లు కొంచెం ఎక్కువే అయ్యాయి.
ట్విట్టర్లో ఒకటికి రెండు స్పెషల్ పోస్టులతో బన్నీ తన ఎమోషన్‌ను ఫాలోవర్లతో పంచుకున్నాడు. ముందుగా ఒక పోస్టులో ‘ఆర్య’ తన జీవితాన్ని ఎలా మార్చిందో బన్నీ గుర్తు చేసుకున్నాడు. తన జీవితంలో అతి పెద్ద మార్పు అంటే ‘ఆర్య’ సినిమానే అని.. ఇప్పటికీ ఈ చిత్రాన్ని పెద్ద మిరాకిల్ లాగా ఫీలవుతానని బన్నీ అన్నాడు. ‘ఫీల్ మై లవ్’ అనే గోల్డెన్ వర్డ్స్ చెప్పినప్పటి నుంచి తనపై ప్రేక్షకులు ప్రేమను కురిపిస్తూనే ఉన్నారని బన్నీ వ్యాఖ్యానించాడు.
ఇక తనతో పాటు ఈ సినిమాకు పని చేసిన మిగతా వాళ్ల జీవితాలు కూడా ఎంతగా మారిపోయాయో మరో పోస్టులో గుర్తు చేసుకున్నాడు బన్నీ. దర్శకుడిగా సుకుమార్, నిర్మాతగా దిల్ రాజు, సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్, ఛాయాగ్రాహకుడిగా రత్నవేలు, డిస్ట్రిబ్యూటర్‌గా బన్నీ వాసుల జీవితాలు ఈ సినిమాతో మారిపోయాయని.. ఇంకా చాలామంది జీవితాలను ఈ సినిమా మార్చిందని.. ‘ఆర్య’ అనే మ్యాజిక్ తమ జీవితాల్లోకి వచ్చినందుకు కృతజ్ఞులమని.. ఈ సినిమా పట్ల తమ కృతజ్ఞత ఎప్పటికీ అలాగే ఉంటుందని అన్నాడు బన్నీ.
This post was last modified on May 7, 2021 3:42 pm
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…
యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…
ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…
ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా చెప్పుబడుతున్న వార్ 2, కూలి ఒకే రోజు ఆగస్ట్ 14…