Movie News

సల్మాన్ అత్యాశ కొంప ముంచుతుందా?

కరోనా విలయం ఎలా ఉన్నప్పటికీ గత ఏడాదిలా ఈసారి రంజాన్ పండక్కి సల్మాన్ రాజీ పడాలని అనుకోలేదు. మే 13న ఈద్ కానుకగా తన కొత్త సినిమా ‘రాధె’ను రిలీజ్ చేయడానికి డిసైడైపోయాడు. దేశవ్యాప్తంగా ఎక్కడా థియేటర్లు సరిగా నడవని పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేసి ఏం చేసుకుంటాడనే ప్రశ్న తలెత్తకుండా.. థియేటర్లతో పాటు ఒకేసారి ‘జీ’ ఓటీటీలో, డీటీహెచ్‌ల్లో (ఆన్ డిమాండ్) సినిమాను విడుదల చేయడానికి ‘రాధె’ టీం ఫిక్సయింది.

‘పే పర్ వ్యూ’ పద్ధతిలో సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ఇంతకుముందే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇంతకీ ఈ భారీ చిత్రానికి టికెట్ రేటు ఎంత పెడతారా అని అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు. ఆ విషయాన్ని తాజాగా వెల్లడించారు. ఈ సినిమా చూసేందుకు 249 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఐతే ఈ రేటు చాలా ఎక్కువ అనే అభిప్రాయం ఎక్కువమందిలో వ్యక్తమవుతోంది.

ఇంతకుముందు ‘ఖాలీ పీలీ’ అనే చిన్న సినిమాకు ‘జీ’ ఓటీటీ రూ.200 టికెట్ రేటు పెట్టి పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేస్తే సరైన స్పందన లేకపోయింది. ఐతే ఈ సినిమాకు అంత మంచి టాక్ ఏమీ రాలేదు. కానీ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నది సల్మాన్ సినిమా. ‘రాధె’పై అంచనాలూ తక్కువగా ఏమీ లేవు. థియేటర్‌కు ఒక కుటుంబం వెళ్లి సినిమా చూస్తే వెయ్యి రూపాయలకు పైగా ఖర్చవుతున్నపుడు ఇంట్లో కూర్చుని రూ.249 పెట్టి కుటుంబమంతా సినిమా చూడలేరా అన్నది చిత్ర బృందం ఆలోచన కావచ్చు. కానీ ఓటీటీల సబ్‌స్క్రిప్షన్ కోసం డబ్బులు పెట్టి, మళ్లీ సినిమా చూసేందుకు ఇంత రేటు పెట్టాలంటే జనాలు ఆలోచిస్తారు. చాలా ఓటీటీల ఏడాది సబ్‌స్క్రిప్షన్లు రూ.300తో మొదలై రూ.1000కే వస్తుండగా.. ఒక సినిమాకు ఇంత రేటా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘రాధె’ టీం అత్యాశ వల్ల సినిమాకు చేటు జరిగినా జరగొచ్చు అనే హెచ్చరికలూ వస్తున్నాయి.

ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలను ఈజీగా పైరసీ చేస్తున్నారని.. డీటీహెచ్‌ల్లో కూడా సినిమాను రిలీజ్ చేస్తే పైరసీ మరింత సులువవుతుందని.. ‘పే పర్ వ్యూ’ రేటు తక్కువ ఉంటే జనాలు డబ్బులు పెట్టి వెంటనే సినిమా చూసేస్తారని.. రేటు ఎక్కువ కాబట్టి రీచ్ తగ్గుతుందని, అలాగే జనాలు ఒక రోజు ఆగి పైరసీ వైపు మళ్లే ప్రమాదం ఉందని.. కాబట్టి ఈ నిర్ణయం రాధె’ను దెబ్బ కొట్టినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంటున్నారు.

This post was last modified on April 27, 2021 9:26 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

అమరావతి పోయినా విశాఖ వస్తుందని జగన్ నమ్మకమా?

ఏపీ రాజ‌ధాని ఏది?  అంటే.. ఇప్పుడు చెప్పుకొనే ప‌రిస్థితి లేదు. 2019కి ముందు వ‌ర‌కు రాజ‌ధాని అమ‌రావతి అని చెప్పుకొనే…

2 hours ago

గూగుల్ యాడ్స్ కే గుమ్మరించారు

దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…

2 hours ago

ఏజెంట్ గారూ ఇప్పటికైనా కరుణించండి

సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…

3 hours ago

కల్కి నిర్ణయం ఆషామాషీ కాదు

అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…

3 hours ago

ఆ టైటానిక్ ప్రయాణికుడి వాచ్ ఖరీదు రూ.12.17 కోట్లు

టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…

3 hours ago

కూటమి విజయాన్ని ఖరారు చేసిన వైసీపీ.?

వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…

3 hours ago