వైల్డ్ డాగ్.. వైల్డ్ డాగ్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ ప్రియుల చర్చల్లో ఉన్న సినిమా ఇది. మూడు రోజుల కిందటే నెట్ ఫ్లిక్స్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయగా.. భాషతో సంబంధం లేకుండా అందరూ విరగబడి ఈ చిత్రాన్ని చూస్తున్నారు. తొలి రెండు రోజులు నెట్ ఫ్లిక్స్‌లో ‘వైల్డ్ డాగ్’ తెలుగు వెర్షణ్ నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అయింది. తమిళం, హిందీ వెర్షన్లకు కూడా మంచి స్పందన వచ్చింది.
ఇండియాలోనే కాదు.. యుఎస్ సహా పలు దేశాల్లో ‘వైల్డ్ డాగ్’ ట్రెండ్ అవుతుండటం విశేషం. ఈ సినిమా బాగుందంటూ సోషల్ మీడియాలో చాలామంది మెసేజ్‌లు పెడుతున్నారు. ఎలివేషన్లు ఇస్తున్నారు. ఈ సినిమా థియేటర్లలో ఎందుకు సరిగా ఆఢలేదని ఆశ్చర్యపోతున్నారు. ఏప్రిల్ 2న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని పెద్దగా ఆకర్షించలేకపోయింది. మంచి టాక్ తెచ్చుకుని కూడా ఓపెనింగ్స్ లేవు. ఫుల్ రన్లో రూ.3 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేయగలిగింది.
నిజానికి ‘వైల్డ్ డాగ్’ థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ కావాల్సిన సినిమా. కానీ థియేటర్లు పున:ప్రారంభమై సినిమాలు బాగా ఆడుతుండటంతో ఆ డీల్ క్యాన్సిల్ చేసి మరీ ముందు థియేటర్లలో రిలీజ్ చేశారు. కొంచెం గ్యాప్ తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసేలా డీల్ రివైజ్ చేశారు. కానీ థియేటర్ల నుంచి ఆశించిన ఆదాయం రాలేదు. అక్కడ సినిమా డిజాస్టర్ స్టేటస్ అందుకుంది. కానీ ఇప్పుడు ఓటీటీలో సినిమాకు మంచి స్పందన వస్తోంది.
ఇది చూసి ఆ థియేట్రికల్ రిలీజ్ లేకపోయినా బాగుండేది, నాగార్జున పరువు దక్కేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న పెద్ద హీరో సినిమాకు మరీ రూ.3 కోట్ల షేర్ రావడం దారుణం. అది చూసి నాగార్జునను సోషల్ మీడియాలో అందరూ ట్రోల్ చేశారు. అక్కినేని అభిమానుల పరిస్థితి ఘోరం అప్పుడు. ఇప్పుడు ఓటీటీలో వస్తున్న స్పందన చూస్తే.. నేరుగా డిజిటల్ మీడియంలోనే రిలీజ్ చేసి ఉంటే బాగుండేదని, నాగ్‌కు అవమాన భారం తప్పేదని అంటున్నారు. ఒకవేళ నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసి మంచి రెస్పాన్స్ వచ్చి ఉంటే.. ఇలాంటి సినిమాను థియేటర్లలో ఎందుకు రిలీజ్ చేయలేదని జనాలు అనేవారేమో.
This post was last modified on April 26, 2021 7:31 am
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…