పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద స్టార్లలో ఒకడు. కానీ నటుడిగా మాత్రం ఆయనకు గొప్ప పేరేమీ లేదు. అన్న చిరంజీవిలా ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకోలేదు పవన్. నటుడిగా ఆయనకు చాలా పరిమితులున్న సంగతి అభిమానులు సైతం గుర్తిస్తారు. పెర్ఫామెన్స్‌తో కాకుండా యూత్‌కు నచ్చే స్క్రీన్ ప్రెజెన్స్‌తో, స్టైల్‌తో పవన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. విలక్షణమైన వ్యక్తిత్వం కూడా అభిమానులను పెంచింది.
పవన్ ఇప్పటిదాకా చేసిన చిత్రాల్లో నటన పరంగా అద్భుతం అని చెప్పుకునే పాత్రలు పెద్దగా కనిపించవు. ‘బాగా చేశాడు’ అనే మాటలు మాత్రమే వినిపిస్తాయి. నిజానికి ‘అజ్ఞాతవాసి’ లాంటి కొన్ని సినిమాల్లో పవన్ నటన పేలవంగా ఉంటుంది కూడా. కాకపోతే పెద్ద స్టార్ కాబట్టి దాని గురించి మీడియాలో చర్చ ఉండదు. అభిమానులు కానీ.. సామాన్య ప్రేక్షకులు కానీ పవన్ నుంచి నటన పరంగా ఎప్పుడూ పెద్దగా ఆశించరు.
ఐతే పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘వకీల్ సాబ్’ చూశాక మాత్రం అందరికీ పెర్ఫామర్ పవన్ కళ్యాణ్ కనిపించాడు. కెరీర్లోనే ‘ది బెస్ట్’ అనిపించే పెర్ఫామెన్స్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఎన్నడూ లేని విధంగా పవన్ నటన గురించి అందరూ మాట్లాడుకుంటుండటం విశేషం. హిందీలో అమితాబ్ బచ్చన్ సటిల్ యాక్టింగ్‌తో ప్రత్యేకత చాటుకున్న పాత్ర ఇది. అలాంటి పాత్రలో పవన్ అనగానే ఎక్కడ తేలిపోతాడో అనిపించింది అందరికీ.
పైగా ‘వకీల్ సాబ్’లో ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు చూస్తే పవన్ చాలా సాధారణంగా కనిపిస్తాడు కూడా. అప్పుడు డౌట్లు ఇంకా పెరుగుతాయి. కానీ ద్వితీయార్ధంలో వచ్చే కోర్టు సన్నివేశాల్లో పవన్ నటన చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఆషామాషీగా నటిస్తే ఆ సన్నివేశాల్లో ఎమోషన్ పండదు. ఐతే మహిళల సమస్యలు, మనోభావాల చుట్టూ తిరిగే సన్నివేశాల్లో పవన్ నిజంగా ఫీలై నటించినట్లుగా ఆ సన్నివేశాలు కనిపిస్తాయి. ఆయనలో వ్యక్తిగతంగా కనిపించే ఆవేశం కూడా ఈ సీన్లలో గోచరిస్తుంది. ప్రకాష్ రాజ్ లాంటి గ్రేట్ పెర్ఫామర్‌కు దీటుగా పవన్ కోర్టు సన్నివేశాల్లో నటించి మెప్పించాడు. అందుకే ఎన్నడూ లేని విధంగా పవన్‌కు నటుడిగా ఈ సినిమాతో గొప్ప ప్రశంసలు దక్కుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates