Movie News

ఆ జానర్‌కు చరమగీతం పాడేసిన ‘సైనా’

స్పోర్ట్స్ బయోపిక్.. కొన్నేళ్ల ముందు బాలీవుడ్లో మంచి గిరాకీ ఉన్న సినిమా. భారత అథ్లెటిక్స్ దిగ్గజం మిల్కా సింగ్ జీవిత కథ ఆధారంగా తీసిన ‘బాగ్ మిల్కా బాగ్’.. ఆటల్లో అన్యాయానికి గురై బందిపోటుగా మారిన పాన్ సింగ్ తోమర్ మీద తీసిన ‘పాన్ సింగ్ తోమర్’.. అత్యంత సామాన్య నేపథ్యం వచ్చి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది క్రికెట్ అభిమానులను సంపాదించుకున్న ఎం.ఎస్.ధోని జీవిత నేపథ్యంలో తెరకెక్కించిన ‘ఎం.ఎస్.ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ’ అద్భుత విజయాలు సాధించాక ఈ జానర్‌‌కు మాంచి డిమాండ్ ఏర్పడింది. వరుసబట్టి మరిన్ని స్పోర్ట్స్ బయోపిక్స్ అనౌన్స్ చేశారు.

ఐతే ఎవరి కథను తీస్తే, ఎలా తీస్తే ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు అని గుర్తించడంలో ఫిలిం మేకర్స్ విఫలమయ్యారు. సచిన్ మీద డాక్యుమెంటరీ తరహాలో ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’ తీస్తే అది ప్రేక్షకులకు రుచించలేదు. మేరీకోమ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన సినిమా కూడా అంతగా ఆడలేదు.

తాజాగా బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మీద తీసిన ‘సైనా’ అయితే ఈ జానర్‌కు దాదాపు చరమగీతం పాడేసిందని చెప్పొచ్చు. లెజెండరీ స్టేటస్ అందుకున్న ఒకప్పటి క్రీడాకారుల గురించి సినిమా తీయడం బాగుంటుంది. లేదంటే ఇప్పటి క్రీడాకారుల గురించి కూడా మనకు తెలియని విషయాలు చూపిస్తే సినిమా వర్కవుట్ అవుతంది. ఇప్పుడు ఆటలో కొనసాగుతున్న వ్యక్తుల జీవితాలను ఎమోషన్ లేకుండా, అందరికీ తెలిసిన విషయాలనే చూపిస్తే ఏం ఆసక్తి ఉంటుంది? ‘సైనా’ సినిమా విషయంలో సరిగ్గా అదే జరిగింది. ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో కనీస ఆసక్తి చూపించలేదు. ట్రైలర్ చూసినపుడే చాలా పేలవంగా అనిపించింది. కొత్తగా ఏమీ కనిపించలేదు.

ఈ సినిమాకు రిలీజ్ ఖర్చులు కూడా రాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెట్టిన పెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీరే అయింది. ఈ దెబ్బకు ప్రి ప్రొడక్షన్ దశలో ఉన్న సింధు, గోపీచంద్ లాంటి వాళ్ల బయోపిక్స్ సందిగ్ధంలో పడ్డాయి. ఇప్పటికే ఇవి పట్టాలెక్కడంలో చాలా ఆలస్యం జరిగింది. ఇప్పుడు ‘సైనా’కు ఎదురైన పరాభవం చూశాక ఈ సినిమాలను ఆపేసినా ఆశ్చర్యం లేదు. మన ముందు యాక్టివ్‌గా ఉన్న క్రీడాకారుల జీవితాలపై సినిమాలు తీయకపోవడమే మంచిదన్న అభిప్రాయం ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.

This post was last modified on April 8, 2021 7:09 pm

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

2 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

4 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

4 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

5 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

13 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

15 hours ago