రంగ్‌దె సినిమాలో హీరో హీరోయిన్లు నితిన్-కీర్తి సురేష్‌ల కెమిస్ట్రీనే మేజర్ హైలైట్ లాగా కనిపిస్తోంది. సినిమా అంతటా వీళ్లిద్దరి మధ్య గిల్లి కజ్జాలు ఉంటాయని ట్రైలర్ చూస్తే అర్థమైంది. బయట కూడా తమ పాత్రలకు తగ్గట్లే నితిన్, కీర్తి ఒకరిపై ఒకరు పంచులేసుకుంటూ సినిమా ప్రమోషన్‌ను నడిపిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ ఒరవడి కొనసాగుతోంది. సినిమాకు సంబంధించి ఈవెంట్లలో అయితే చెప్పాల్సిన పని లేదు.
కర్నూలులో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నితిన్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు కీర్తి డుమ్మా కొట్టిందంటూ కౌంటర్ వేశాడు. తర్వాత ఆమె ప్రమోషన్లకు రావట్లేదంటూ ట్వీట్ వేయడమూ తెలిసిందే. తాజాగా రాజమండ్రిలో జరిగిన రిలీజ్ ఈవెంట్లోనూ నితిన్-కీర్తి ఒకరిపై ఒకరు పంచ్‌లు వేసుకోవడం విశేషం.
రంగ్‌దె ట్రైలర్ చూస్తే ఈ సినిమాలో తాను విలన్ అనిపించేలా ఉందని.. కానీ అది నిజం కాదని అంది కీర్తి సురేష్. తాను అలా ప్రవర్తించడానికి కారణమేంటో సినిమా ద్వితీయార్ధంలో తెలుస్తుందని.. అది తెలియకుండా దాచి పెట్టారని ఆమె అంది. ట్రైలర్లో కనిపించే తన ప్రవర్తన అంతా ప్రతీకారంలో భాగం అని.. అసలేం జరిగింది, నితిన్ ఏం చేశాడన్నది సెకండాఫ్‌లో తెలుస్తుందని ఆమె అంది. సినిమాలో అసలు విలన్ నితినే అని తీర్మానించింది.
మరోవైపు నితిన్ మాట్లాడుతూ.. కీర్తి రియల్ లైఫ్ క్యారెక్టర్‌నే ఈ సినిమాలో చూపించారని, ఆమె బయట అందరినీ టార్చర్ చేస్తుంటుందని, అది చూసి ఇన్‌స్పైర్ అయి దర్శకుడు వెంకీ అట్లూరి అను పాత్రను తీర్చిదిద్దాడని, ఒకరకంగా చెప్పాలంటే రంగ్‌దె కీర్తి బయోపిక్ అని వ్యాఖ్యానించడం విశేషం. మొత్తానికి బయట నితిన్, కీర్తిల ఈ గిల్లి కజ్జాలు సినిమా ప్రమోషన్‌కు మాత్రం బాగానే ఉపయోగపడుతున్నాయి.
This post was last modified on March 25, 2021 7:29 am
కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతారకు కోపం వచ్చింది. హీరో ధనుష్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మూడు పేజీల…
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…