విజయ్ దేవరకొండ వ్యాపారంలో పవన్ ఇప్పుడు కీలక పాత్ర పోషించబోతున్నాడు. సాధారణంగా టాలీవుడ్ లో ఒక హీరోకు సంబందించిన విషయంలో మరొక హీరో పేరు కనిపిస్తే ఆ న్యూస్ ఎన్ని రూమర్స్ కు దారి తీస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ప్రస్తుతం రౌడీ స్టార్ కు సంబందించిన ఒక న్యూస్ లో పవన్ పేరు గట్టిగానే వైరల్ అవుతోంది.
విజయ్ త్వరలోనే ఒక సినిమా థియేటర్ ను స్టార్ట్ చేయబోతున్నాడు. ఏషియన్ సినిమాస్ తో చేతులు కలిపి ఏషియన్ విజయ్ దేవరకొండ సినిమాస్ కు శ్రీకారం చుట్టాడు. అంటే మహేష్ బాబు AMB సినిమాస్ స్టైల్ లో ఇప్పుడు AVD సినిమాస్ అన్నమాట. మహబూబ్ నగర్ కు చెందిన ఒక పాత థియేటర్ ను రీ కన్ స్ట్రక్ట్ చేయిస్తున్నారు.
దాన్ని పూర్తిగా మల్టిప్లెక్స్ స్టైల్ లోకి మార్చి అక్కడి జనాలకు బిగ్గెస్ట్ స్క్రీన్ తో సరికొత్త ఫీల్ ను ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇక ఇప్పటికే పనులన్నీ పూర్తయినట్లు సమాచారం. ఇక ఆ కొత్త తెరపై మొదట పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ బొమ్మ పడనుందని తెలుస్తోంది. మరి ఈ బిజినెస్ లో విజయ్ ఎంతవరకు లాభాలు ఆ అందుకుంటాడో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates