టాలీవుడ్లో తండ్రీ కొడుకులతో రొమాన్స్ చేసిన హీరోయిన్లు చాలా కొద్దిమందే. అందులో కాజల్ అగర్వాల్ ఒకరు. ఆమె ముందు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో జోడీ కట్టింది. వీళ్లిద్దరి కలయికలో మగధీర, నాయక్, గోవిందుడు అందరివాడేలే సినిమాలు వచ్చాయి. తర్వాత ఆమె చిరంజీవితో ఖైదీ నంబర్ 150లో జోడీ కట్టింది. కొంత తర్జనభర్జన తర్వాత కొడుకు హీరోయిన్‌ను తన సినిమాలోకి తీసుకున్నాడు చిరు. ఇప్పుడు ఆచార్యలోనూ చిరుకు జోడీగా కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా కాజల్ మరో సీనియర్ హీరోతో జోడీ కట్టబోతున్నట్లు తాజా సమాచారం. ఆ హీరో మరెవరో కాదు.. అక్కినేని నాగార్జున. చందమామ ఇప్పటికే దడ సినిమాలో నాగచైతన్యతో రొమాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చైతూ తండ్రి నాగ్ సరసన సినిమా చేయబోతోందట.
త్వరలోనే వైల్డ్ డాగ్‌తో ప్రేక్షకులను పలకరించనున్న నాగ్.. ప్రవీణ్ సత్తారుతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులోనూ ఆయన అండర్ కవర్ పోలీసాఫీర్‌గానే కనిపించనున్నాడు. ఈ థ్రిల్లర్ మూవీలో నాగార్జునకు జోడీగా కాజల్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. కాజల్ పెళ్లి తర్వాత కూడా జోరుగానే సినిమాల్లో నటిస్తోంది. కాకపోతే ఇంతకుముందులా యంగ్ హీరోలకు పరిమితం కావడం లేదు. తెలుగులో చిరుతో, తమిళంలో కమల్ హాసన్‌తో ఆమె సినిమాలు చేస్తోంది.
ఇప్పుడు నాగ్ రూపంలో మరో సీనియర్ హీరో ఆమెతో రొమాన్స్ చేయనున్నాడు. ఇలా ఈ తరంలో ఇద్దరు యంగ్ హీరోలతో.. వారి తండ్రులతో నటించిన అరుదైన కథానాయికగా కాజల్ రికార్డు సృష్టించబోతోంది. ఒకప్పుడు తన తండ్రి ఏఎన్నార్‌తో జోడీ కట్టిన శ్రీదేవితో నాగ్ కలిసి సినిమా చేశాడు. ఇప్పుడు కొడుకు హీరోయిన్‌తో రొమాన్స్ చేయబోతున్న అరుదైన ఘనత ఆయన సొంతం కానుంది.
This post was last modified on March 17, 2021 10:25 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…