Movie News

‘ఆర్ఆర్ఆర్‌’లో ఆలియా పాత్ర‌పై నార్త్ ఇండియ‌న్స్ అతి

‘ఆర్ఆర్ఆర్’లో సీత పాత్రలో నటిస్తోంది బాలీవుడ్ భామ ఆలియా భట్. సోమవారం ఆలియా పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ముందు రోజు రాముడి విగ్రహం ముందు కూర్చున్నట్లుగా ఆమె ప్రి లుక్ కూడా వదిలారు. ఐతే సీత పేరు పెట్టుకుని, రాముడి విగ్రహం ముందు కూర్చుంటే.. ఆమె రాముడి సతీమణి సీతాదేవి అయిపోతుందా అన్న ఇంగిత జ్ఞానం లేకుండా నార్త్ ఇండియన్స్ చేస్తున్న అతి ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

‘ఆర్ఆర్ఆర్’లో ఆమె చేస్తున్నది సీతా మాత పాత్ర అనుకుని వాళ్లు చేస్తున్న ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. ఆలియాకు సీతా మాత పాత్ర చేసే అర్హత లేదట.. తన పాత్రను పరిచయం చేస్తూ ‘సీతా మాత అని కాకుండా జస్ట్ ‘సీత’ అని కామెంట్ పెట్టడం తప్పట. ఇందుకుగాను ‘ఆర్ఆర్ఆర్’ను బాయ్‌కాట్ చేయాలట. ఉత్తరాదికి చెందిన ఒక జర్నలిస్టు సైతం ‘ఆర్ఆర్ఆర్’ను బాయ్‌కాట్ చేసే అవకాశాలున్నట్లు ఒక ట్వీట్ పెట్టడం గమనార్హం.

ఇంకా ఎంతోమంది నార్త్ ఇండియన్స్ ఆలియా ‘ఆర్ఆర్ఆర్’లో సీత పాత్ర చేయడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడినప్పటి నుంచి బాలీవుడ్లో నెపోటిజం బ్యాచ్‌కు సోషల్ మీడియాలో వ్యతిరేకత తప్పట్లేదు. ఈ బ్యాచ్‌లో ప్రధానంగా వ్యతిరేకత ఎదుర్కొంటున్న వాళ్లలో ఆలియా ఒకరు. ఆమె ఏం చేసినా తప్పే అన్నట్లు చూస్తున్నారు.

ఈ క్రమంలోనే ‘ఆర్ఆర్ఆర్’లో సీత పాత్ర పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ పాత్ర పేరు సీత తప్ప, ఆమె చేస్తున్నది దేవత అయిన సీతా దేవి పాత్ర కాదు అనే కనీస జ్ఞానం వారికి లేకపోతోంది. అల్లూరి సీతారామరాజు భార్య పేరు సీత అని.. ఆమె పేరు కలిసొచ్చేలాగే రామరాజు అనే అతడి పేరుకు సీత యాడ్ అయిందని వాళ్లు అర్థం చేసుకోలేకపోతున్నారు. దక్షిణాదికి చెందిన గొప్ప వాళ్ల గురించి నార్త్ వాళ్ల దగ్గర కనీస సమాచారం ఎప్పుడూ ఉండదు. ఇక్కడి చరిత్రపై అవగాహన ఉండదు. ఈ అజ్ఞానంతోనే ఆలియా చేస్తున్న పాత్ర గురించి ఏమీ తెలియకుండా ట్వీట్లు వేస్తూ అబాసుపాలవుతున్నారు.

This post was last modified on March 16, 2021 2:09 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

7 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

8 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

8 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

10 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

12 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

13 hours ago