జాతిరత్నాలు.. ఇప్పుడు టాలీవుడ్లో ఈ సినిమానే హాట్ టాపిక్. దీని కాస్ట్ అండ్ క్రూ చూస్తే చిన్న సినిమాలా కనిపిస్తుంది కానీ.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఓ పెద్ద సినిమా స్థాయిలో సందడి చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వారాంతంలో హౌస్ ఫుల్స్‌తో రన్ అవుతోందీ చిత్రం. ఈ సినిమా చూద్దామని థియేటర్లకు వెళ్లి.. టికెట్లు దొరక్క ప్రేక్షకులు వేరే సినిమాలకు వెళ్లాల్సిన పరిస్థితి. అంతలా ఓవర్ ఫ్లోస్ ఉన్నాయి. ఇంతగా ప్రేక్షకులను అలరిస్తున్న సినిమాలో కథ అంటూ చెప్పుకోవడానికి ఏమీ లేదు.
ఈ మధ్య కాలంలో కాస్త పేరున్న ఏ సినిమాలోనూ ఇంత సిల్లీ స్టోరీ లేదు అంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా పతాక సన్నివేశాలు చూస్తే జనాలకు దిమ్మదిరిగిపోతుంది. సినిమా చూసిన వాళ్లు వేరే వాళ్లకు ఇదీ స్టోరీ అని.. సినిమా ఇలా ముగుస్తుందని చెబితే.. ఇంత సిల్లీగా ఉంది ఇదేం సినిమా అనిపిస్తుంది. ఇలాంటి సినిమా ఎలా నచ్చిందన్న సందేహం కూడా కలుగుతుంది.
కానీ కథ గురించి, లాజిక్ గురించి ఏమాత్రం ఆలోచించనివ్వని మ్యాజిక్ ‘జాతిరత్నాలు’లో ఉంది. అల్లు అర్జున్ అన్నట్లు బుర్రలు ఈ సినిమాను ఎంజాయ్ చేయాలంటే బుర్రలు స్విచాఫ్ చేసేయాలి. సన్నివేశాల్లోని ఫన్ మీద మాత్రమే మన దృష్టి ఉండాలి. ముగ్గురు ప్రధాన పాత్రధారుల అదిరిపోయే పెర్ఫామెన్స్.. ప్రతి సన్నివేశంలోనూ బోలెడంత చమత్కారం.. పేలిపోయే పంచులతో ప్రేక్షకులకు సమయమే తెలియనివ్వదు ‘జాతిరత్నాలు’. నవ్వి నవ్వి అలసిపోయాక చివర్లో కొన్ని సిల్లీ సీన్లు వస్తాయి. వేరే సినిమాలో ఇలాంటి ముగింపు ఉంటే ప్రేక్షకులకు చికాకు పుడుతుంది. కానీ ‘జాతిరత్నాలు’లో అప్పటిదాకా ఉన్న ఎంటర్టైన్మెంట్ వల్ల ముగింపును లైట్ తీసుకుంటారు.
ఐతే తెరమీద మనల్ని అంత వరకు బాగా ఎంటర్టైన్ చేశారు కాబట్టి మనం సర్దుకుపోతాం. కానీ ఈ కథ చెప్పి దర్శకుడు అనుదీప్.. నిర్మాత నాగ్ అశ్విన్‌ను ఎలా ఒప్పించాడన్నదే ఆశ్చర్యకరం. కథ విన్న ఎవరికైనా మరీ సిల్లీగా ఉందనే అనిపిస్తుంది. అనుదీప్ అప్పటికే పేరున్న దర్శకుడైతే నమ్మడానికి అవకాశముంటుంది. కానీ అతను తీసిన ఒక్క సినిమా. ‘పిట్టగోడ’ పేరుతో వచ్చిన ఆ సినిమా ఆడలేదు. అలాంటపుడు ఈ కుర్ర దర్శకుడిని నమ్మి.. అతను ఫన్ జనరేట్ చేయగలడన్న భరోసాతో సినిమా నిర్మించడానికి ముందుకు రావడం గొప్ప విషయమే. అందుకు నాగ్ అశ్విన్‌ను అభినందించాలి.
This post was last modified on March 13, 2021 7:03 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…