Movie News

తండ్రీ కొడుకుల సినిమా మొదలైంది

కోలీవుడ్లో ఒక ఆసక్తికర, క్రేజీ కాంబినేషన్లో సినిమా మొదలైంది. సీనియర్ కథానాయకుడు విక్రమ్, అతడి కొడుకు ధ్రువ్ విక్రమ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న చిత్రం బుధవారమే సెట్స్ మీదికి వెళ్లింది. ఈ సినిమాను విలక్షణ చిత్రాలకు పెట్టింది పేరైన యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రూపొందిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో విక్రమ్‌కు జోడీగా సిమ్రాన్ నటిస్తుండటం గమనార్హం. సంతోష్ నారాయణన్ సంగీతం అందించనున్నాడు. విక్రమ్, ధ్రువ్ కలయికలో సినిమా కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

‘అర్జున్ రెడ్డి’ రీమేక్‌ ‘ఆదిత్య వర్మ’తో ధ్రువ్ హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య బాల దర్శకత్వంలో మొదలైన ‘అర్జున్ రెడ్డి’ ఫస్ట్ వెర్షన్ ‘వర్మ’ ఔట్ పుట్ తేడా కొట్టడంతో దాన్ని పక్కన పడేయడం.. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ అసిస్టెంట్ డైరెక్టర్ గిరీశయ్యతో ‘ఆదిత్య వర్మ’ను తీయడం.. ఆ చిత్రం ఏడాదిన్నర కిందట విడుదలై బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయాన్నందుకోవడం తెలిసిందే. ఆ తర్వాత ధ్రువ్ హీరోగా మరో సినిమా ఏదీ మొదలు కాలేదు. తండ్రితో కలిసి చేస్తున్నదే అతడి రెండో సినిమా. విక్రమ్‌కు ఇది 60వ సినిమా కావడం విశేషం.

కార్తీక్ దర్శకత్వంలో విక్రమ్, ధ్రువ్ నటిస్తుండటంతో వీరి పాత్రలు ఎంత కొత్తగా, సంచలనాత్మకంగా ఉంటాయో అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. మరి తెరపై తండ్రీ కొడుకులుగా నటిస్తారా.. లేదా ఇద్దరి మధ్య వైరాన్ని చూపిస్తారా అన్నది ఆసక్తికరం. విక్రమ్ ప్రస్తుతం ‘కోబ్రా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. తెలుగులోనూ రిలీజైన ‘డిమాంటి కాలని’, ‘అంజలి ఐపీఎస్’ చిత్రాల దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. విక్రమ్ ఇందులో బహుముఖ పాత్రలు చేస్తున్నాడు. ఈ ఏడాది వేసవిలో అది ప్రేక్షకుల ముందుకు రానుంది.

This post was last modified on March 10, 2021 6:38 pm

Share

Recent Posts

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

3 hours ago

మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…

5 hours ago

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

7 hours ago

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…

7 hours ago

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…

7 hours ago

పంజాని మరో ఆరెంజ్ చేసేలా ఉన్నారు

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…

8 hours ago